జూలై నెలలో 11వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అయితే ఈ మాసంలో ఎంతో శక్తివంతమైన సూర్య గ్రహం, పూజ గ్రహంతో పాటు, శుక్ర గ్రహం సంచారం చేయబోతున్నాయి.
అంతే కాకుండా ఇదే సమయంలో శని కూడా తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో ఈ శ్రావణమాసంలో శక్తివంతమైన శివయోగం ఏర్పడుతుంది. అయిదే ఈ శివయోగం నాలుగు రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. కాగా, ఆ రాశులు ఏవి అంటే?
మిథున రాశి : జూలైలో ప్రారంభమయ్యే శ్రావణ మాసం మిథున రాశి వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? ఇది వారి ఆర్థిక సమస్యలను తొలిగించడమే కాకుండా, ధనలాభం కూడా తీసుకొస్తుందంట. అదే విధంగా ఇంట్లో అనేక శుభకార్యాలు కూడా జరిగే ఛాన్స్ ఉన్నది. అలాగే వీరు ఏ పని చేసినా వారికి విజయం సిద్ధిస్తుంది. ఇంటా బయట మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
కన్య రాశి : కన్యా రాశి వారికి శివయోగం వలన అదృష్టం తలుపు తడుతుంది. ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహంతో వీరు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంటుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు తెలుపుతున్నారు.
కుంభరాశి : కుంభరాశి వారికి శ్రావణమాసం మొత్తం చాలా శుభ ప్రదం. వీరు ఈ మాసం మొత్తం శుభ వినడమే కాకుండా అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి సంతోషం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ మాసం మొత్తం ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి : వృషభ రాశి వారికి శ్రావణ మాసం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడంతో చాలా ఆనందంగా జీవిస్తారు. అదే విధంగా వీరు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అన్నింటా శుభ ఫలితాలే కలుగుతాయి.



































