దొంగలని.. వెధవలని చేసిన అవ్వ! ఈమె ఐడియాకి దొంగలు పరార్!

www.mannamweb.com


నేటికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చోరీలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేస్తున్నారు. అయినా కూడా తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఈ దొంగతనాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇళ్లు, బ్యాంకు, బంగారు షాపులు, ఇతర దుకాణాల్లో చోరీలు చేసి..విలువైన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఇక దొంగల దెబ్బకు సామాన్య జనమే కలవర పడుతుంటే.. ఓ వృద్ధురాలు చేసిన పనికి ఆ దొంగలే అవాక్కయ్యారు. ఇక ఆ వృద్ధురాలు చేసిన పనికి స్థానిక ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఆలస్యం ఏందుకు ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. అలానే ఎవరైన ఒంటరిగా ఉన్న సమయంలో కూడా ఇళ్లల్లో చోరీలకు తెగపడుతుంటారు. ఎవరైన ఎదురు తిరిగితే చంపడానికి సైతం వెనుకాడరు. అలా దొంగళను ఎందిరించి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అయితే ధైర్యం చేసి పోరాడుతారు. ఇక వృద్ధులు అయితే దొంగలను ఎదిరించే సాహసం చేయలేరు. అలానే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేరు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్దురాలు చేసిన పనికి దొంగలకే చెమటలు పట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో జరుగుతున్న దొంగతనాలు అందరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అలానే గుండాల మండలం సీతారామపురంలో అనే గ్రామంలో కూడా తరచూ చోరీల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచూ జరుగుతున్న దొంగతనాలతో స్థానికులు కలవరపడుతున్నారు.

ఇదే సమయంలో అదే గ్రామంలో నివాసం ఉండే కప్పరి పిచ్చమ్మ అనే వృద్ధురాలు ఓ అద్భుతమైన ఐడియా వేసింది. తన ఇంట్లో చోరీ జరిగిన విలువైన వస్తువులు పోకుండా మంచి పథకం వేసింది. గతంలో ఆ వృద్ధురాలి ఇంట్లో రెండు సార్లు చోరీ జరిగింది. ఆ సమయంలో నగదుతో పాటు విలువైన వస్తువులు పోయాయి. దీంతో మరోసారి అలాంటి చేదు అనుభవం ఎదుర్కొకూడదని ఆమె భావించింది. ఇంట్లో విలువైన వస్తువులను, డబ్బులను తన వద్దే పెట్టుకుని ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లి పడుకుంది.

ఆ వృద్ధురాలి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇదే మంచి ఛాన్స్ అని దొంగలు భావించారు. వెంటనే ఇనుప వస్తువులను కోసే బ్లేడ్ తో ఆ ఇంటి తాళం కోశారు. ఇంట్లోకి వెళ్లి మొత్తం వెతికిన ఓ పది రూపాయల నోటు కూడా దొరలేదు. చివరకు వెనుతిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లి..అక్కడి పరిస్థితి చూసి దొంగలు వచ్చినట్లు పిచ్చమ్మ గ్రహించింది. అలానే స్థానికులు ఆమె ఇంట్లో ఏ విలువైనవి చోరీకి గురయ్యాయో అని తెగ బాధపడ్డారు. నగదు తనవద్దే ఉన్నాయని ఆ వృద్దురాలు చెప్పడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా కండబలంతో కాకుండా బుద్ధిబలంతో దొంగలకు ఆ వృద్ధురాలు బుద్ది చెప్పింది.