February 2025 : ఈ రాబోయే ఫిబ్రవరి ఇప్పుడు నివసించే (బ్రతికి ఉన్న) వారందరూ… చూసే చివరి ఫిబ్రవరి. ఎందుకంటే..? ఇటువంటి ఫిబ్రవరి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది.
రాబోయే ఫిబ్రవరిలో…4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు , 4 శనివారాలు వస్తున్నాయి. ఇటువంటి ఫిబ్రవరిని చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే..? ఇటువంటి ఫిబ్రవరి తిరిగి 823 సంవత్సరాలకు వస్తుంది. ఫిబ్రవరి సంవత్సరంలో రెండవ నెల అన్న సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఫిబ్రవరి నెలలో లీపు సంవత్సరాలలో 29 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలకు 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఏడాదిలో అతి చిన్న నెల అయిన ఫిబ్రవరి విషయంలో ఎప్పుడూ అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది లీపు సంవత్సరం కాదన్న విషయం తెలిసిందే. కాబట్టి, ఈ ఏడాది మొత్తం 28 రోజులు ఫిబ్రవరిలో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరిలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని కొందరు చెప్పారు. పలు సోషల్ మీడియా యూజర్లు ఇలా జరగడం అత్యంత అరుదు అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయని సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెడుతున్నారు. 2025 ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు అలా అన్నీ నాలుగేసి వస్తాయని.. ఇది అత్యంత అరుదని పేర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో కూడా ఫిబ్రవరి నెలలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు వచ్చాయి. 2025 సంవత్సరం ఫిబ్రవరి క్యాలెండర్ ను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో ప్రతి వారం నాలుగు సార్లు వచ్చింది. లీపు సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు, వారానికి ఏడు రోజులు. కాబట్టి ప్రతి వారం నాలుగు సార్లు వస్తాయి. లీపు సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. దీని కారణంగా నెలలో ఒకటి లేదా మరొక రోజు ఐదు సార్లు వస్తుంది. మిగిలిన వారాలు నాలుగు సార్లు వస్తాయి. 2021, 2023 సంవత్సరాలలో ఫిబ్రవరి నెల క్యాలెండర్ ను పరిశీలిస్తే అందులో కూడా ప్రతి వారం నాలుగేసి సార్లు వచ్చింది. 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా వస్తుందా అనేదానికి లీపు సంవత్సరం తప్ప ఫిబ్రవరిలో ప్రతి రోజు నాలుగు సార్లు వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదేమీ అత్యంత అరుదైన విషయమని చెప్పలేదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో నిజం లేదు. 2021లో కూడా ఇదే వాదనతో పోస్టులు వైరల్ అయ్యాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. లీపు సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. ప్రతి వారం ఫిబ్రవరిలో నాలుగు సార్లు వస్తుంది. ఇది అరుదైన విషయం కాదు.