ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అందరి దృష్టి ఉల్లిపాయలు, టమాటాలపైనే పడుతుంది. త్వరగా, రుచిగా ఏదైనా వంట చేయాలనుకుంటే రెండు లేదా మూడు గుడ్లు కొట్టి, ఎగ్ కర్రీ తయారు చేస్తుంటారు.
ఇళ్లలోనే కాకుండా, బ్యాచిలర్స్ వంటల్లో కూడా కోడిగుడ్డు, టమాటా కర్రీ మొదటి గుర్తొచ్చే రెసిపీ. అయితే, కొందరు ఎగ్ కర్రీ చేసేటప్పుడు తడబడతారు.
కర్రీలో గుడ్డు ఎప్పుడు కొట్టి పోయాలో తెలియక గందరగోళానికి గురవుతారు. కొంతమంది గుడ్డును ఉడకబెట్టి వాడితే, మరికొంతమంది ముందుగా కొట్టడం వల్ల గుడ్డు పొడిపొడిగా మారి, కర్రీలో గుడ్డు కనిపించకుండా పోతుంది. అయితే, గుడ్డును ఉడకబెట్టకుండా, కొట్టి పోసినా ఆకారం చెడకుండా రుచికరమైన ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
గుడ్లు – 4 (ఉడకబెట్టినవి, పొట్టు తీసి కొద్దిగా కోతలు పెట్టుకోవాలి)
చింతపండు – నిమ్మకాయ సైజు (నీటిలో నానబెట్టి రసం తీయాలి)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమాటో – 1 (తరిగినది)
పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
పసుపు – 1/4 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
గరం మసాలా – 1/2 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
నీరు – 1.5 కప్పులు
కొత్తిమీర – అలంకరణకు
తయారీ విధానం:
గుడ్లను ఉడకబెట్టి, చల్లారిన తర్వాత పొట్టు తీసి, చిన్న కోతలు పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి.చింతపండు రసం, నీరు, ఉప్పు వేసి బాగా కలిపి మరిగించాలి. ఉడకబెట్టిన గుడ్లను జాగ్రత్తగా గ్రేవీలో వేసి, 5-7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి వేడిగా సర్వ్ చేయాలి.
































