సనాతన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మానవ జన్మ గత జన్మలో చేసిన మంచి చెడుల పనుల ఆధారంగా నడుస్తుందని విశ్వాసం. ఇక ద్వాపర యుగం వరకూ కొంతమంది వ్యక్తులు ఏదోక శాపం కారణంగా జన్మను పొందవలసి వచ్చిందని విశ్వాసం.
ఇందుకు మనిషి మంచి చెడులను నిర్ణయించే యమధర్మ రాజు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఒక మహర్షి శాపం కారణంగా యముడు వితంతువు గర్భాన జన్మించవలసి వచ్చింది. అతనే విదురుడు. కురు సామ్రాజ్యంలో న్యాయకోవిదుడుగా ఖ్యాతిగాంచిన విదురుడే..యమ ధర్మ రాజు. పురాణాల ప్రకారం ఓ మహర్షి శాపం కారణంగా మహాభారత కాలంలో యముడు పనిమనిషికి జన్మించవలసి వచ్చింది.
మహర్షి మైత్రేయ సందేహాన్ని నివృత్తి చేశాడు
పురాణాల ప్రకారం మైత్రేయ మహర్షి విదురుడికి నువ్వు నిజానికి యమ ధర్మ రాజు అని చెప్పి సందేహాన్ని తీర్చాడు. మాండవ్య మహర్షి శాపం వల్ల నువ్వు మనిషి రూపంలో దాసి కొడుకుగా పుట్టవలసి వచ్చింది. ఈ శాపానికి గల కారణాన్ని విదురుడు అడిగినప్పుడు, ఒకసారి కొంతమంది దొంగలు ఒక రాజు ఖజానా నుండి డబ్బు అపహరించి పారిపోతున్నారని ఋషి చెప్పాడు. సైనికులు దొంగల కోసం నలువైపులా వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దొంగలు తప్పించుకోవడం కష్టమైంది. పరిగెడుతూనే దొంగలు దట్టమైన అడవి గుండా వెళుతున్నారు. ఆ అడవిలో మాండవ్య మహర్షి ఆశ్రమం ఉండేది. భయాందోళనలో దొంగలు దోచుకున్న డబ్బు మొత్తాన్ని ఆ ఆశ్రమంలో దాచిపెట్టి, అక్కడి నుంచి పారిపోయారు.
దొంగలను వెంబడిస్తూ రాజు సైనికులు మాండవ్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వెదికిన తర్వాత ఆ ఆశ్రమంలో దోచుకున్న డబ్బు దొరికింది. సైనికులు ఋషిని దొంగగా భావించారు. అతనిని పట్టుకొని రాజు వద్దకు తీసుకెళ్ళారు. సైనికుల నుంచి అన్నీ తెలుసుకున్న రాజు ఆ మహర్షికి మరణశిక్ష విధించాడు.
ఉరి వేసినా మరణించని మహర్షి
మహర్షిని ఉరి తీస్తున్నప్పుడు మహర్షి మంత్రాలు పఠించడం ప్రారంభించాడు. రాజు సేవకులు అతన్ని ఉరితీశారు. అయినా ఆశ్చర్యకరంగా ఋషి చనిపోలేదు. సైనికులు సైతం ఉరివేసినా ఎందుకు చనిపోవడం లేదని ఆశ్చర్యపోయారు. ఈ వార్త రాజుకు తెలియడంతో అతను తన తప్పును గ్రహించి, ఋషికి క్షమాపణ చెప్పాడు.
అప్పుడు ఆ మహర్షి రాజుతో ఇలా అన్నాడు, “ఓ రాజా నేను నిన్ను క్షమిస్తాను కానీ నేను నిర్దోషి అయినా నాకు మరణశిక్ష విధించిన యమధర్మ రాజును క్షమించను?” దీనికి నేను యముడిని ఖచ్చితంగా శిక్షిస్తాను. అని చెప్పి తన తపస్సు శక్తితో యముడి దగ్గరకు చేరుకున్నాడు. నేను ఏ నేరం చేయనప్పుడు మరణశిక్ష ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అని యముడిని అడిగాడు. కోపంతో ఉన్న మాండవ్య మహర్షిని చూసి యమధర్మరాజు కూడా భయపడ్డాడు. మహర్షికి కోపం వచ్చి తమను శపించే అవకాశం ఉందని భావించాడు.
యముడిని శపించిన మాండవ్య ఋషి
దీంతో యమధర్మ రాజు మాండవ్య ఋషితో మాట్లాడుతూ.. మీరు చిన్నతనంలో సీతాకోకచిలుకను ముల్లుతో పొడిచారని, ఆ పాపం వల్ల ఇప్పుడు ఇలా శిక్షింపబడ్డారని మహర్షితో చెప్పాడు. దీనిపై మాండవ్య మహర్షి మాట్లాడుతూ శాస్త్రాల ప్రకారం అజ్ఞానం వల్ల ఎవరైనా పాపం చేస్తే కలలో శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. నీవు నన్ను శాస్త్ర విరుద్ధముగా శిక్షించావు. కనుక నీవు దాసుని కుమారునిగా మనుష్యరూపంలో పుడతావని శాపం ఇచ్చాడు. మైత్రేయ మహర్షి ఇదంతా చెప్పి..ఈ శాపం కారణంగా యమధర్మ రాజు అయిన నువ్వు కురు వంశంలో దాసి కొడుకుగా విదురుగా జన్మించావని విదురుడితో చెప్పాడు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని Mannam Web ధృవీకరించడం లేదు