‘బిగ్ బాస్ 9’లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న గత సీజన్ల పోటీదారుల జాబితా ఇది.

బుల్లితెర ప్రేక్షకులు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవ్వబోతున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.


గత సీజన్ యావరేజ్ అనే రేంజ్ లో సాగింది. రచ్చ చేయాల్సిన సందర్భాలు కంటెస్టెంట్స్ ఎన్నో కల్పించారు కానీ, హోస్ట్ నాగార్జున(Akkineni Nagarjuna) వాటిని చాలా సాఫ్ట్ గా డీల్ చేయడం తో పస లేకుండా పోయింది. దీంతో ఆడియన్స్ అత్యధిక శాతం మంది బిగ్ బాస్ ని చూడడం మానేశారు. గత సీజన్ కేవలం యావరేజ్ రేంజ్ కి మిగిలిపోవడానికి కారణం నాగార్జున హోస్టింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ టాప్ 2 వరకు కూడా వచ్చాడు.

ఈ సీజన్ లో కూడా అలా పాత కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఇంతకీ ఆ పాత కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారో ఒకసారి చూద్దాం. సీజన్ 6 లో టాప్ 6 వరకు శ్రీ సత్య ‘బిగ్ బాస్ 9’ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతుంది. ఈమె ఒకప్పుడు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉండేది. అలాంటి సమయం లోనే ఆమెకు ‘బిగ్ బాస్ 6’ లో అవకాశం వచ్చింది. బాగా ఆడింది కూడా, బయటకు వెళ్లిన తర్వాత ఈమె అందానికి కచ్చితంగా సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ కేవలం ఆమె ఎంటర్టైన్మెంట్ షోస్ కి మాత్రమే పరిమితమైంది. అటు సినిమాలు లేవు, ఇటు సీరియల్స్ కూడా లేవు. ఇక ఈ సీజన్ లోకి అడుగుపెట్టబోతున్న మరో పాత కంటెస్టెంట్ తేజస్విని ముదివాడా.

ఈమె ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ‘బిగ్ బాస్ 2’ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ సరికొత్త సీజన్ లో సందడి చేయబోతుంది. అదే విధంగా సీజన్ 7 కి చెందిన ప్రియాంక జైన్ కూడా ఈ సరికొత సీజన్ లోకి రాబోతున్నట్టు సమాచారం. 7 వ సీజన్ లో ఈమె టాప్ 5 కంటెస్టెంట్ గా నిల్చింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత పలు ఎంటర్టైన్మెంట్ షోస్, అదే విధంగా తన యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే పరిమితమైంది. ఇదంతా పక్కన పెడితే సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిల్చిన సన్నీ, అదే సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన మానస్ వంటి వారు కూడా ఈ సరికొత్త సీజన్ లో భాగం కాబోతున్నారు. వీళ్లంతా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారానే హౌస్ లోకి వెళ్తారట, ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్స్ ఉండకపోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.