అబద్దాలాడే వారికి మరణం తర్వాత విధించే శిక్ష ఇదే..అబద్దాలకోరుని ఇలా గుర్తించవచ్చు

హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణం విష్ణువు,విష్ణువు వాహనమైన గరుడుల మధ్య సంభాషణను వివరిస్తుంది. గరుడ పురాణంలో మరణం, పునర్జన్మ, అంత్యక్రియల ఆచారాలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి.


గరుడ పురాణం ప్రకారం అబద్దాలు ఆడేవారిని కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. అలాగే అబద్దాలు ఆడేవారికి మరణం తర్వాత విధించే శిక్ష ఎలా ఉంటదో తెలుసా?

యముడు విధించే శిక్ష ఇదే

మనషి అన్నాక తప్పుఒప్పులు సహజం. తెలిసో తెలియకో ఏదో ఒక సందర్భంలో ఎంతటివారైనా తప్పు చేస్తారు. ఉద్దేశ్యపూర్వకంగా చేయకపోవచ్చు గానీ పొరపాటున జరుగుతుంటాయి. చిన్నా పెద్దా అబద్ధాలు చెబుతూనే ఉంటారు. అయితే ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ జన్మలో చెప్పే ప్రతి అబద్ధానికి నరకంలో శిక్ష పడుతుందని మీకు తెలుసా. గరుడ పురాణం ప్రకారం అబద్దాలు ఆడే వ్యక్తి మరణం తర్వాత అతని ఆత్మ నరకానికి వెళ్తుంది. అప్పుడు చిత్రగుప్తడు ఆ వ్యక్తి భూలోకంలో చేసిన పనులకు సంబంధించిన చిట్టాను యమధర్మరాజుకి వివరిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి భూలోకంలో చెప్పిన ప్రతి అబద్ధం లెక్కించబడుతుంది.

అబద్ధాలు చెప్పే వారి ఆత్మలు తప్తకుంభ నరకానికి పంపబడతాయి. ఈ నరకంలో ఎక్కడ చూసినా మంటలు రగులుతుంటాయని అంటారు. యమదూతలు పాపాత్ములను తమ నోటి ద్వారా వేడి నూనె, ఇనుప పొడితో నింపిన వేడి కుండలో వేస్తారంట. నరకంలో అబద్ధాలకు శిక్ష ఇలాగే ఉంటుందట.

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి అబద్దం చెప్తున్నాడని గుర్తించగలిగే కొన్నిసంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

నిజాన్ని దాచడానికి ట్రై చేయడం

అబద్ధం చెప్పడం ఒక కళ. అబద్ధాలకోరు తాను సృష్టించిన కథను నిజమని నిరూపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి ఎప్పుడూ సత్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు.

శారీరక స్వరూపం

ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు స్త్రీ లేదా పురుషుడి బాడీ లాంగ్వేజ్‌ని గమనించడం ద్వారా వారి మనస్సులో ఏముందో తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అసౌకర్యంగా లేదా గంభీరంగా ఉంటే.. మాట్లాడేటప్పుడు వ్యక్తి భుజాలు వంగి ఉంటే ఆ వ్యక్తి ఏదో దాచిపెట్టే అవకాశం ఉంది. వ్యక్తి రిలాక్స్డ్ భంగిమలో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే ఇది కూడా అబద్ధానికి సంకేతం కావచ్చు.

శరీర సంజ్ఞలు

కొందరు మాట్లాడేటప్పుడు ఒకటి లేదా రెండు చేతులను కదిలిస్తారు. కొంతమంది మాట్లాడేటప్పుడు కాళ్లు కదుపుతారు. ఇది చాలా సాధారణమైన ప్రవర్తన, కానీ ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు వారి సాధారణ ప్రవర్తన లేదా అలవాట్లలో మార్పు కనిపిస్తుంది. అబద్ధం చెప్పే వ్యక్తి చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తారు,ఎదుటి వ్యక్తిని చూడకుండా మాట్లాడతాడు.