చికెన్ గ్రేవీ సీక్రెట్ ఇదే! ఈజీగా, టేస్టీగా వండాలంటే ఈ పేస్ట్ వేసి చూడండి

ఇంటికి అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ టిప్ ట్రై చేయండి. మీరు వండే చికెన్ లో ఈ రెండు ఐటెమ్స్ తో పేస్ట్ చేసి కలపండి. ఇక దీని రుచిని మెచ్చుకోకుండా ఉండలేరు.


కొంచెం గ్రేవీతోనే అన్నం మొత్తం తినేసేంత రుచిగా ఉంటుందిది. ఈ గ్రేవీ ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం వంటి అన్నింటితో కలిపి వడ్డించడానికి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ గ్రేవీని క్విక్ గా ఎలా వండాలో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

చికెన్

నూనె

అల్లం వెల్లుల్లి పేస్ట్

కరివేపాకు

పసుపు పొడి

ఉప్పు

మిరప పొడి

ధనియాల పొడి

గరం మసాలా

టమాటో

సోంపు

బెరడు (దాల్చిన చెక్క)

లవంగం

కొబ్బరి

వేరుశనగ (లేదా జీడిపప్పు)

తయారీ విధానం:

ఒక పాన్‌లో కావాల్సినంత నూనె పోసి, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

తరువాత కరివేపాకు, శుభ్రం చేసిన చికెన్ వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా మరిగించాలి.

తర్వాత ఈ మిశ్రమంలో టమోటాలు వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

ఈలోగా, ఒక జాడీలో సోంపు, ఏలకులు, లవంగాలు, కొబ్బరి, వేరుశనగ (లేదా జీడిపప్పు) వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

మరుగుతున్న పులుసులో ఈ పేస్ట్ వేసి, మళ్లీ బాగా మరిగించాలి.

చివరగా కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన చికెన్ గ్రేవీ సిద్ధం.

ఈ చికెన్ గ్రేవీని అతిథులకు కేవలం 10 నిమిషాల్లో వడ్డించి వారిని ఆకట్టుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.