జు ఉదయం నిద్ర లేవగానే చాలామంది టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. రోజువారి జీవితంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువ మంది ప్రతిరోజూ రెండు నుంచి మూడుసార్లు టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. ప్రతిరోజు టీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, కొత్త ఉత్తేజం కలిగిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, టీ అతిగా తాగడం మంచిది కాదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. టీకి బదులుగా బ్లాక్ టీ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బ్లాక్ టీలో లభించే కొన్ని ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అలాగే బ్లాక్ టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పూర్తిగా తగ్గుతాయి. దీనివల్ల స్ట్రోక్ రాకుండా ఉంటుంది.
కొంతమందిలో బ్లాక్ టీ రోజు ఉదయం తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా తొలగిపోతాయట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. కొంతమందిలో బ్లాక్ టీ తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
కొంతమందిలో బ్లాక్ టీ తాగితే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గిపోతారు. ఇప్పటికే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎలాంటి చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగడం చాలా మంచిది. పాలతో చేసిన టీలతో పోలిస్తే బ్లాక్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు అస్సలు ఉండవు.
బ్లాక్ టీ గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బ్లాక్ టీ లో నిర్థిష్టమైన గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. జీర్ణక్రియకు, శరీర ఆరోగ్యానికి గట్ మైక్రోబయోమ్ కీలకంగా ఉంటుంది. ఇది పోషకాల శోషణలోనూ, జీవక్రియలోనూ సహాయపడుతుంది. తద్వారా శరీరంలో కొవ్వు కరిగించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బ్లాక్ టీ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం, శరీరంలో కొవ్వులను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. బ్లాక్ టీ తీసుకుంటే ఈ ప్రమాదం తగ్గుతుంది.