డ్రై స్కిన్‌తో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

చలికాలం చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. చల్లని గాలి , తేమ లేకపోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో ఉండే సహజ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయవచ్చు. క్రీమ్, తేనె మిశ్రమం డ్రై స్కిన్‌కు ఒక గొప్ప పరిష్కారం. ఈ రెమెడీని ఎలా తయారు చేయాలి ? ఎన్ని సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయనే విషయాను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


క్రీమ్, తేనె మిశ్రమం:

క్రీమ్, తేనె రెండూ చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. క్రీమ్ చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే సహజ కొవ్వు చర్మం యొక్క తేమను కాపాడుతుంది. తేనె కూడా చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుంగా మృదువుగా మార్చడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది.

ప్రయోజనాలు:
చర్మానికి లోతైన పోషణనిస్తుంది.
దురద, కరుకుదనాన్ని తగ్గిస్తుంది.
మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
పొడిబారిన చర్మాన్ని ఎక్కువ కాలం హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

క్రీమ్, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి ?
కావాల్సినవి:

1 టేబుల్ స్పూన్ తాజా క్రీమ్
1 స్పూన్ తేనె
ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ తీసుకుని అందులో తేనె కలపండి. తర్వాత
రెండు పదార్థాలను బాగా కలిపి, మృదువైన పేస్ట్‌ను సిద్ధం చేయండి.
అనంతరం శుభ్రమైన, పొడి చర్మంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.
ఆ తర్వాత చేతులతో మసాజ్ చేయడం ద్వారా చర్మం అంతటా వ్యాపిస్తుంది.
తద్వారా ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.
దీన్ని ముఖంపై 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఆపై శుభ్రమైన టవల్‌తో తడపండి.
ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు ఉపయోగించండి. ఇది మీ చర్మం యొక్క మృదుత్వాన్ని కాపాడుతుంది.

డ్రై స్కిన్ ఉన్న వారు పాటించాల్సిన టిప్స్:

సరైన క్లెన్సర్ కొనడం:
వింటర్‌లో క్లెన్సర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. చర్మం నుండి మురికి, నూనె, మేకప్ తొలగించడానికి మంచి నాణ్యత గల క్లెన్సర్‌ను రోజుకు రెండుసార్లు ఉపయోగించండి. మీకు పొడి చర్మం ఉన్నట్లయితే హైడ్రేటింగ్ క్లెన్సర్‌ను ఎంచుకోండి. జిడ్డుగల చర్మం ఉంటే, ఆయిల్ కంట్రోల్ క్లెన్సర్‌ని ఉపయోగించండి.

టోనర్ కొనండి:
క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మంచి టోనర్ ఉపయోగించండి. ఇది రంధ్రాలను బిగుతుగా ఉంచి చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. మీరు రోజ్ వాటర్‌ను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా మృదువుగా చేస్తుంది.

మాయిశ్చరైజర్ అవసరం:
రోజుకు రెండుసార్లుమాయిశ్చరైజర్ వాడటం అవసరం . దీని కోసం మంచి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. మీ చర్మం పొడిగా ఉంటే, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. జిడ్డుగల చర్మం ఉన్నవారికి లిక్విడ్ ఆధారిత మాయిశ్చరైజర్ మంచిది.