రేపే తొలి ఏకాదశి..తులసి ఆకలుతో ఇలా చేస్తే చేసిన పాపలు మొత్తం పోతాయ్.. అస్సలు మిస్ అవ్వదు

రేపు దేవశయని ఏకాదశి . సనాతన ధర్మంలో ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏకాదశి ..ఇది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది.
ఏకాదశి రోజు ఏ మంచి పని చేసిన సరే అది సక్సెస్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకం . ఏడాదిలో వచ్చే ప్రతి తిధికి ఒకొక్క పేరు ..ఒక్కొక్క విశిష్టత ఉంటుంది . కానీ ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి మాత్రం చాలా చాలా విశిష్టత ఉంది . చాలా పవర్ఫుల్ ఇది అని అంతా నమ్ముతూ ఉంటారు. తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు మొదలవుతాయి అనేది ఒక నమ్మకం కూడా .


కాగా ఈ ఏడాది జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఏడాది లో వచ్చే 24 ఏకాదశిలలో అష్ట శుద్ధ ఏకాదశి నే తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు . ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై సయనిస్తూ ఉంటారు. ఆ కారణంగానే ఆషాడ మాసంలో ఏ మంచి పనులు చేయడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపరు జనాలు. ఒకవేళ ఏదైనా మంచి పనులు చేస్తే శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలు దక్కవు అనేది వాళ్ళ అభిప్రాయం. ఈరోజున యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక్ శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారట . చరిత్ర ఇదే చెబుతుంది.

ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు . అయితే ఈ నాలుగు మాసాలలో శ్రీ మహావిష్ణువు పూజించవచ్చు . ఉపవాసం చేయొచ్చు . ఆయనకు ప్రత్యేకంగా పూజలు చేయడం ద్వారా కొన్ని విశేషమైన ఫలితాలను కూడా పొందవచ్చు అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఈ రోజున మాంసం – ఉల్లి మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు . ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అది శ్రీమహావిష్ణువుకి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకుల అంటే చాలా చాలా ఇష్టం .

తులసి ఆకులను శ్రీ మహా విష్ణుమూర్తికి ఏకాదశి రోజున సమర్పిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది . విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసి ఆకు కూడా ఒకటి . తులసి ఆకులు లేదా తులసి రేకులను మాలగా చేసి లేదా ఆయనకు అలంకరించి పూజిస్తే చాలా చాలా ఇష్టపడతారట . శ్రీమహావిష్ణువుని పూజించేటప్పుడు పూజలో కచ్చితంగా తులసి రేకులను ఉపయోగించడం ఇంపార్టెంట్ అంటున్నారు పండితులు. అంతేకాదు తులసి మాలతో శ్రీమహావిష్ణువుని పూజిస్తే అప్పుల బాధలు, భార్యాభర్తల సమస్యలు అన్ని తొలగిపోతాయట . ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఎప్పుడు కలకలాడుతూ ఉంటుందట. రేపే తొలి ఏకాదశి కావడంతో పండితులు శ్రీ మహావిష్ణువుని తులసి ఆకులతో పూజించండి అంటూ చెబుతున్నారు..!!

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అనేది పాఠకులు గుర్తుంచుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.