పాపం అనుదీప్‌.. గుర్తు పట్టక నెట్టేశారు!

వన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లోని విమల్‌ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.


ఇదే కార్యక్రమంలో జాతిరత్నాల దర్శకుడు అనుదీప్‌ కేవీ కూడా హాజరు అయ్యాడు. కార్యక్రమం మొదలు అయిన తర్వాత కొంత సేపటికి అనుదీప్‌ తాపీగా స్టేజ్‌ పైకి ఎక్కేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు అనుదీప్‌ను గుర్తించక పోవడంతో పైకి వెళ్లేందుకు అనుమతించలేదు. అనుదీప్‌ను పోలీసులు నెట్టేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జాతిరత్నాలు వంటి సూపర్‌ హిట్‌ సినిమాను తీసిన అనుదీప్‌ రెగ్యులర్‌గా టీవీల్లో కనిపిస్తూనే ఉంటాడు, అంతే కాకుండా ఆయన మరో సినిమాను చేశాడు, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి వైరల్‌ అవుతూనే ఉంటాడు. అలాంటి అనుదీప్‌ను ఆ పోలీసు గుర్తు పట్టలేదు. అనుదీప్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది, అతడిని చాలా మంది రోల్‌ మోడల్‌గా తీసుకుంటారు. కానీ కొందరిలో ఇప్పటికీ అనుదీప్‌కి గుర్తింపు దక్కలేదు అనేందుకు ఇదే సాక్ష్యం. అనుదీప్‌ కాస్త హడావిడిగా స్టేజ్‌ ఎక్కేందుకు ప్రయత్నించినా కూడా పోలీసులు ఎవరో సెలబ్రిటీ అనుకునే వారు. కానీ అనుదీప్‌ ఒక్కడే సింగిల్‌గా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెనక్కి నెట్టేశారు.

ప్రస్తుతం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. అందరి ముందు పరువు పోయిందిగా అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్ తెగ క్రియేట్‌ చేస్తున్నారు, అందరూ చూశారు అంటూ అనుదీప్‌ స్టైల్‌లో మీమ్స్‌ ను వైరల్‌ చేస్తున్నారు. సాధారణంగానే అనుదీప్‌ సోషల్‌ మీడియాలో చిన్న విషయానికి పెద్దగా వైరల్‌ అవుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఈ విషయంతో మరింతగా వైరల్‌ అవుతున్నాడు. హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్‌ లాంచ్‌కి ఆహ్వానించి మా అనుదీప్‌ను మరీ ఇంతగా అవమానిస్తారా అంటూ చాలా మంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్‌ కామెడీని ఇష్టపడే వారు ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

అనుదీప్‌ సినిమాల విషయానికి వస్తే జాతిరత్నాలు సినిమాతో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే తమిళ హీరో శివ కార్తికేయన్‌తో ప్రిన్స్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నష్ట పరచింది. తెలుగు, తమిళ్‌లోనూ ప్రిన్స్ మూవీ ఫ్లాప్‌ కావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. దర్శకత్వంతో పాటు అప్పుడప్పుడు ఇతర దర్శకులతో కలిసి స్క్రిప్ట్‌ చర్చల్లో పాల్గొంటాడు, కొన్ని సినిమాల్లో నటుడిగానూ కనిపించాడు. ప్రస్తుతం ఈయన ఒక యంగ్‌ స్టార్‌ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా గురించిన పూర్తి వివరాలను త్వరలో వెళ్లడించబోతున్నట్లు దర్శకుడు అనుదీప్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.