ఈ ఏడాది రిలీజైన టాప్ 5 మలయాళం మూవీస్.. ఈ ఓటీటీల్లో చూసేయండి.. లిస్టులో థ్రిల్లర్ సినిమాలే ఎక్కువ

ఈ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజైనా వసూళ్ల పరంగా సక్సెస్ సాధించినవి కొన్నే. అందులో ఇప్పటికే ఐదు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని రాబోతున్నాయి. మరి ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలేంటో చూడండి.

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది కూడా వెల్లువలా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. సక్సెస్ సాధిస్తున్నవి మాత్రం కొన్నే అని చెప్పాలి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు 10 ఉండగా.. వీటిలో ఐదు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఎల్2: ఎంపురాన్ కూడా ఉంది. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.


ఓటీటీలోని మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీస్

గతేడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ వచ్చినా.. చివరికి నష్టాల్లోనే ముగిసింది. ఈ ఏడాది కూడా చాలా వరకు పరిస్థితి అలాగే ఉంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆ ఇండస్ట్రీని ఆదుకున్నాయి. ఆ మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.

1. ఎల్2: ఎంపురాన్ – జియోహాట్‌స్టార్ ఓటీటీ

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.268 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

2. రేఖాచిత్రమ్ – సోనీ లివ్ ఓటీటీ

ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన మూవీ రేఖాచిత్రమ్. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్స్ లో ఇదీ ఒకటి. బాక్సాఫీస్ దగ్గర రూ.57.3 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. 40 ఏళ్ల కిందట జరిగిన ఓ యువతి హత్య కేసును ఛేదించే ఓ పోలీస్ అధికారి చుట్టూ తిరిగే మూవీ ఇది.

3. ఆఫీసర్ ఆన్ డ్యూటీ – నెట్‌ఫ్లిక్స్

కుంచకో బొబన్ నటించిన థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నకిలీ గొలుసు తాకట్టు కేసు అమ్మాయిల వరుస ఆత్మహత్యలకు కారణమయ్యే ఓ గ్యాంగ్ ను ఎలా పట్టిస్తుందన్నదే ఈ మూవీ స్టోరీ. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.

4. పొన్‌మ్యాన్ – జియోహాట్‌స్టార్

ఈ ఏడాది సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మరో సినిమా పొన్‌మ్యాన్. బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర రూ.18.3 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లిళ్లకు అమ్మాయి కుటుంబానికి బంగారు నగలు ఇచ్చి, తర్వాత చదివింపుల డబ్బు తీసుకునే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. ఓ అమ్మాయి పెళ్లికి 25 సవర్ల బంగారం ఇచ్చినా.. అందులో సగం కూడా డబ్బు రాకపోవడంతో ఆ మిగిలిన బంగారాన్ని వసూలు చేయడానికి అతడు ఎంత వరకూ వెళ్తాడన్నది ఇందులో చూడొచ్చు.

5. ఐడెంటిటీ – జీ5 ఓటీటీ

టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఈ ఐడెంటిటీ. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఓ పోలీస్ అధికారి, జర్నలిస్ట్, స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్లు వసూలు చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.