ఈ నెల 7న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం, కుంభరాశిలోని శతభిసం మరియు పూర్వాభాధ్ర నక్షత్రాలలో సంభవిస్తుంది.
కాబట్టి కుంభరాశివారు ఈ చంద్రగ్రహణాన్ని చూడవద్దని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. మరుసటి రోజున యధావిధిగా చంద్రగ్రహణ శాంతి జరపుకోవాలని తెలిపారు. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించే ఈ సందర్భంగా, చంద్రుడి రూపం ఎరుపు నారింజ రంగులో మెరిసిపోతూ రక్త చంద్రుడిగా ఆకాశాన్ని అలరించనుంది.
మొత్తం 82 నిమిషాలపాటు సంపూర్ణ చంద్రగ్రహణం దశ కొనసాగనుంది. ఇది ఈ దశాబ్దంలోనే అత్యంత వైభవమైన చంద్రగ్రహణం అని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంతో పాటు ఆసియాఖండం, ఆస్ట్రేలియా పశ్చిమభాగం, యూరప్, ఆఫ్రికాదేశాల్లో గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లో అన్ని ప్రాంతాలవారు చంద్రగ్రహణానని చూడవచ్చు. ఢిల్లీ, లక్నో, జైపూర్, ముంబై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు, చిన్న పట్టణాల్లో కూడా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.
గ్రహణ స్పర్శకాలం – రాత్రి గం.9-50
ఉన్మీలన కాలం – రాత్రి గం. 10-58
గ్రహణ మధ్యకాలం – రాత్రి గం. 11-41
నిమీలన కాలం – రాత్రి గం. 12-24
గ్రహణ మోక్షకాలం – రాత్రి గం. 1-31
ఆద్యంత పుణ్యకాలం – ఉ గం. 3-41
































