వృషభ రాశి : ఈ రాశి వారికి ఉగాది తర్వాత చాలా అనుకూలంగా ఉందంట. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారంట. శని దేవుని ఎఫెక్ట్‌తో ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వస్తుందంటున్నారు పండితులు.
కన్యా రాశి : ఈ రాశి విశ్వవసు నామ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందని చెబుతున్నారు పండితులు. ఆరోగ్యం బాగుంటుందంట. వృత్తి వ్యాపారాల్లో కలిసిరావడమే కాకుండా మధ్యలో ఆగిపోయిన పనులను ఈ సంవత్సరంలో పూర్తి చేస్తారు.
తుల రాశి : తుల రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.
కుంభ రాశి : ఈ రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే కార్యాలయంలో మీ పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు తొలిగిపోయి, ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.
అంతే కాకుండా విద్యార్థులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఉగాది తర్వాత చాలా అనుకూలంగా ఉంటుందంట. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారని, కుంభరాశి వారికి ఇక తిరుగు ఉండదు అంటున్నారు పండితులు. ( ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది.)