UPSC: యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

UPSC CSE Results | దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (Civils) – 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. (UPSC Civils Final result 2023)

టాప్‌ 10 ర్యాంకర్లు వీళ్లే..
ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. అనిమేష్‌ ప్రధాన్‌ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహాని (5), సృష్టి దబాస్‌ (6), అన్‌మోల్‌ రాఠోర్‌ (7), ఆశీష్‌ కుమార్‌ (8), నౌషీన్‌ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు. గతేడాది విడుదలైన సివిల్స్‌ – 2022 ఫలితాల్లో తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించడం విశేషం.

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
దోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. నందల సాయికిరణ్‌ 27, మేరుగు కౌశిక్‌ 82, పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి.అక్షయ్‌ దీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌ రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌ రాజు 475, పూల ధనుష్‌ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్‌ కుమార్‌ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్‌ కుమార్‌ 830, జె. రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకుల్లో మెరిశారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మే 28న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షను క్లియర్‌ చేసిన వారికి సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టుల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి.. డిసెంబర్‌ 8న మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఏప్రిల్‌ 9 మధ్య వివిధ దశల్లో పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 1016 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేయగా.. ఇందులో జనరల్‌ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీలో 165 , ఎస్టీ కేటగిరీలో 86 మంది చొప్పున ఎంపికయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *