Uric Acid: హై యూరిక్ యాసిడ్ కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ప్రధాన కారణం. దీనికి ఖరీదైన మందులు, చికిత్సలు అవసరం లేదు. నిమ్మకాయతోనే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు.
Uric Acid: ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు (Joints) పట్టేసినట్లు ఉంటుందా? మోకాళ్లు, కాలివేళ్లు లేదా చేతివేళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా? అయితే హై యూరిక్ యాసిడ్ (Uric Acid) సమస్యతో బాధపడుతున్నట్లే.
ఇదే కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ప్రధాన కారణం. దీనికి ఖరీదైన మందులు, చికిత్సలు అవసరం లేదు. నిమ్మకాయ (Lemon)తోనే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. నిమ్మకాయ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే నిమ్మకాయ ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
* నిమ్మకాయ ఎలా పని చేస్తుంది?
మన శరీరంలో ‘ప్యూరిన్ (Purine)’ అనే పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ ప్యూరిన్లు రెడ్ మీట్ (గొర్రె, మేక మాంసం), సముద్రపు ఆహారం (Seafood), ఆల్కహాల్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్ మోతాదు అధికమైతే, అది సూదుల్లాంటి క్రిస్టల్స్‌గా మారి కీళ్లలో పేరుకుపోతుంది. దీనివల్ల నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సమస్యలకు నిమ్మకాయ చక్కటి పరిష్కారం చూపుతుంది. నిమ్మకాయ రుచికి పుల్లగా ఉండి, శరీరం బయట ఆమ్ల (Acidic) లక్షణాన్ని చూపినా, డైజెస్ట్ అయిన తర్వాత అది క్షారంగా (Alkaline) మారుతుంది. ఇది శరీర pH లెవల్ బ్యాలెన్స్ చేసి, ఎక్స్‌ట్రా యూరిక్ యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది.
నిమ్మకాయలో పుష్కలంగా ఉండే సిట్రిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి, మూత్రం ద్వారా సులభంగా బయటకు పంపడంలో కిడ్నీలకు సహాయపడుతుంది అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ C, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కీళ్లకు మరింత నష్టం కలగకుండా కాపాడుతుంది.
* నిమ్మకాయను ఎలా వాడాలి?
బెస్ట్ రిజల్ట్స్ కోసం ఉదయాన్నే నిమ్మరసం తాగాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి. మరిన్ని ప్రయోజనాల కోసం ఒక టీస్పూన్ తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజూ ఉదయం పరగడుపున దీన్ని తాగాలి. ఈ సింపుల్ డ్రింక్ శరీరాన్ని క్లీన్ చేస్తుంది, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. నేచురల్గా యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేస్తుంది.
భోజనం తర్వాత కూడా నిమ్మరసం తాగవచ్చు. ప్రత్యేకించి భారీగా లేదా నూనె పదార్థాలు తిన్నప్పుడు తాగడం మేలు. డైజెషన్ బూస్ట్ చేసి యూరిక్ యాసిడ్ పెరగకుండా ఆపుతుంది. తినే వంటకాల్లో పచ్చి నిమ్మరసం చేర్చుకోవడం కూడా మంచి పద్ధతి. సలాడ్లు, గ్రిల్డ్ వెజిటెబుల్స్ లేదా పప్పులపై చల్లుకోవచ్చు. అయితే బాగా వేడిగా ఉన్న ఆహార పదార్థాలతో కలపవద్దు, ఎందుకంటే వేడికి విటమిన్ C నాశనమవుతుంది.
* తప్పక గుర్తుంచుకోవాల్సిన అంశాలు
నిమ్మకాయను మోతాదుకు మించి ఎక్కువగా వాడొద్దు. అధికంగా తీసుకుంటే పంటి ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి నిమ్మరసం స్ట్రాతో తాగడం లేదా తాగిన వెంటనే నీటితో నోరు పుక్కిలించడం మంచిది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా కడుపులో అల్సర్లు వంటి సమస్యలు ఉంటే, నిమ్మకాయ వాడకాన్ని పెంచే ముందు డాక్టర్‌ని కలవాలి. కిడ్నీ సమస్యలు లేదా డయాబెటిస్ ఉన్నవారు కూడా నిమ్మకాయ వాడే ముందు వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.
* తప్పక గుర్తుంచుకోవాల్సిన అంశాలు
నిమ్మకాయను మోతాదుకు మించి ఎక్కువగా వాడొద్దు. అధికంగా తీసుకుంటే పంటి ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి నిమ్మరసం స్ట్రాతో తాగడం లేదా తాగిన వెంటనే నీటితో నోరు పుక్కిలించడం మంచిది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా కడుపులో అల్సర్లు వంటి సమస్యలు ఉంటే, నిమ్మకాయ వాడకాన్ని పెంచే ముందు డాక్టర్‌ని కలవాలి. కిడ్నీ సమస్యలు లేదా డయాబెటిస్ ఉన్నవారు కూడా నిమ్మకాయ వాడే ముందు వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.
చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.
































