విక్టరీ వెంకటేష్.. ఇప్పటి వరకూ తన తరం నలుగురు హీరోల్లో చివరగా చెప్పుకునే పేరు అనేది కాదనలేని వాస్తవం. మామూలుగా ఆ లిస్ట్ ను చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అనే చదువుతారు.
బట్ ఈ నలుగురి ఇమేజ్ కూడా ఉంది వెంకీకి.అందుకే అతనిది అరుదైన ఇమేజ్ అంటారు. క్లాస్ తో కన్నీళ్లు పెట్టించగలడు, మాస్ తో విజిల్స్ వేయించగలడు. అయితే ఈ లిస్ట్ లో ఇప్పటి వరకూ నాలుగో స్థానంలో ఉన్న వెంకటేష్ తాజాగా సెకండ్ ప్లేస్ కు వచ్చాడు. అది కూడా మిగతా ఇద్దరికీ ఇంక సాధ్యం కాదు అనే రేంజ్ లో దూసుకువచ్చాడు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెబితే ఆ నలుగురులో చిరంజీవి తర్వాతి ప్లేస్ వెంకటేష్ దే కాబోతోంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం మూవీ సమాధానంగా నిలవబోతోంది.
ఈ వెటరన్ స్టార్స్ లో ఇప్పటి వరకు హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన హీరో చిరంజీవి. ఆయన నటంచిన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 244 కోట్లు కొల్లగొట్టి అదరగొట్టింది. కానీ కమర్షియల్ హిట్ పరంగా చూస్తే ఇది లాస్ వెంచర్ అనే చెప్పాలి. తర్వాతి ప్లేస్ లో వాల్తేర్ వీరయ్య 232 కోట్లతో బ్లాక్ బస్టర్ గా ఉంది. ఇక బాలకృష్ణ హయ్యొస్ట్ కలెక్షన్స్ వీర సింహారెడ్డితో 132 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాడు. అఖండ సైతం 132 కోట్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే ఈ రెండు స్థానాలను దాటేయబోతున్నాడు వెంకటేష్.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 131 కోట్లు కొల్లగొట్టి ఎంటైర్ ఇండస్ట్రీతోనూ ఔరా అనిపించుకుంటోందీ మూవీ. పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ గా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇక ఈ వీకెండ్ తో మరో 50 -75 కోట్ల వరకూ వసూళ్లు వస్తాయని చెబుతోంది బాక్సాఫీస్. ఆ మేరకు బుక్ మై షోతో పాటు పేటిఎమ్ వంటి ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ లో టాప్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీనే ఉంది. సో.. ఈజీగా ఈ మూవీతో వెంకటేష్ 200 కోట్లు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
సో.. ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు స్టార్డమ్ అంటే కలెక్షన్ల లెక్కల్లోనే చూస్తున్నారు కాబట్టి.. ఆ నలుగురు హీరోల్లో సెకండ్ ప్లేస్ ఇక నుంచి వెంకటేష్ దే.