చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో జీ2 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోకి లాంచ్ చేయనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే భారత కరెన్సీలో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,000 కాగా.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,500, ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,700గా ఉండనుంది
వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 720×1,612 పిక్సెల్ ఈ స్క్రీన్ సొంతం. రిఫ్రెష్ రేట్ 90Hz, 89.67 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందించారు.
వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్ ఓఎస్ 3పై పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ 7ఎన్‌ఎమ్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను సైడ్‌కు అమర్చారు.
ఇక కెమెరా విషయానికొస్తే వివో జీ2 స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.