ఓటరులారా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రతి ఐదేండ్ల ఒక్కసారి జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి ఓటరూ తనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే సువర్ణ అవకాశం ఇది. అయితే ఓటరు జాగ్రత్త వహించకుండా.. ఓటు వేస్తే ఓటు సరిగ్గా పడకపోక, ఓటు వేసే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్టు బరిలో నిలిచారు. ఎన్నో హామీలు ఇస్తూ.. తమకు ఓటు వేసేట్టు ఓటర్లను మెస్మరైజ్ చేశారు. అలాగే మరోవైపు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓటు వేసే సమయంలో ఓటర్లు పోలింగ్ బూత్ లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అలాగే జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్రతి ఐదేండ్ల ఒక్కసారి జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి ఓటరూ తనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే సువర్ణ అవకాశం ఇది. అయితే ఓటరు జాగ్రత్త వహించకుండా.. ఓటు వేస్తే ఓటు సరిగ్గా పడకపోక, ఓటు వేసే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. అందుకే ఓటరు ముందుగా జాబితా తన పేరు ఉందా? లేదా? చూసుకోవాలి. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మీ ఎపిక్‌ నెంబర్‌, పేరు, అడ్రస్‌తో చెక్‌ చేసుకునే అవకాశం ఉంది.

ఓటు వేసే ప్రక్రియ

>> ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే ప్రక్రియ మొదలవుతుంది.
>> పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి అధికారులకు ముందుగా ఓటర్ స్లిప్పును చూపించండి. దాంతో పాటుగా ఓటరు పార్టు నెంబర్, సీరియల్‌ నెంబర్‌ ను కూడా చూపించాలి.

>> స్లిప్పులో ఉన్న వివరాలతో ఓటరు పూర్తి వివరాలను సరిగ్గా ఉన్నాయా? లేదా? అని ధృవీకరిస్తారు.

>> ఆ తరువాతే పోలింగ్‌ అధికారి ఎడమ చూపుడు వేలుకు సిరా ఇంక్ తో ఓటు వేసినట్టు గుర్తు వేస్తారు.

>> ఆ తరువాత ఓటరు జాబితాలో సంతకం, బొటనవేలి ముద్ర వేయించుకుంటారు.

>> ఓటరు ఎవరికైతే ఓటు వేస్తున్నారో ఆ గుర్తుపై ముద్ర వేసేందుకు ఓ కంపార్టును ప్రత్యేకంగా పెడతారు. అందులోకి వెళ్లి మాత్రమే గుర్తు పెట్టాలి.

>> ఇక ఫైనల్ గా ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఈవీఎం(EVM),దాని పక్కనే వీవీప్యాట్ (VVPAT) ఉంటుంది. అభ్యర్థుల పేర్లు ఈవీఎం ఎడమవైపునకు ఉంటాయి.

>> ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క…. వారికి కేటాయించిన గుర్తులు.. మరో వైపు.. వీటి పక్కన్నే నీలి రంగు బటన్‌ ఉంటాయి.

>> మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న బ్లూ కలర్‌ బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు.

>> బటన్‌ నొక్కిన వెంటనే అయిదు సెకన్ల పాటు బీప్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఆ వెంటనే VVPAT మెషీన్‌పై పచ్చటి లైట్‌ వెలిగి.. లోపల స్లిప్‌ కనిపిస్తుంది.

>> మీరు ఎవరికి ఓటేశారో వారిపేరు, సీరియల్‌ నెంబర్‌, పార్టీ గుర్తు వంటి సమాచారం దానిపై కనిపిస్తాయి.

>> ఈ కాగితపు స్లిప్‌ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ఆ తరువాత ఈ స్లిప్‌ బాక్స్‌లోకి పడిపోతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ అనుమానం వచ్చిన.. మీరు బటన్ నొక్కినప్పుడు శబ్దం రాకున్న అక్కడున్న అధికారులను అడగవచ్చు.