Warangal: ప్లేస్‌మెంట్స్‌లో వరంగల్ NIT అద్భుతాలు

వరంగల్‌ నిట్‌ కళాశాల ప్లేస్‌మెంట్స్‌లో అద్భుత ఫలితాలను సాధించింది.


ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల్లో 79.7శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. సోమిల్‌ మాల్దాని (సీఈసీ) అనే విద్యార్థికి రూ.64.3లక్షల గరిష్ఠ వేతన ప్యాకేజీ లభించింది. ఈ సంవత్సరం 290కిపైగా పేరున్న సంస్థలు క్యాంప్‌సను సందర్శించాయి. ఈ ఏడాది మొత్తం 1,508 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ కోసం నమోదు కాగా, మొత్తం 1201 మంది ఉద్యోగాలు పొందారు.

గత సంవత్సరం 76శాతం ప్లేస్‌మెంట్స్‌తో పోల్చితే 3.7 శాతం ఎక్కువ. ఈ సంవత్సరం గరిష్టంగా రూ.64.3లక్షల వేతన ప్యాకేజీని సోమిల్‌ మాల్దాని పొందారు. ఆయన ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌డీఈ)గా ఉద్యోగం సాధించారు. మొత్తం విద్యార్ధులందరికీ సగటు ప్యాకేజీ రూ.14.35లక్షలు ఉండగా యూజీ విద్యార్థులకు రూ.16లక్షలు, పీజీ విద్యార్థులకు రూ.12.20 లక్షలు ఉంది.