మండే ఎండల్లో APవాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్

www.mannamweb.com


భానుడి భగభగలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడి పోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితో బయటకు వచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఏ జిల్లా చూసినా మండే ఎండలు చెమటలు పట్టించేస్తున్నాయి. అధికారులు కూడా అత్వసరం అయితేనే బయటకు రావాలి అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీలు దాటేస్తున్నాయి. సూర్యూడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఏపీకి వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో సూర్యూడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకుంటున్నాయి. శనివారం పగటిపూట ఉష్ణోగ్రతలు చూస్తే ఏకంగా 7 జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదు అయ్యింది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఇలాంటి ఎండలు అంటే మేనాటికి పరిస్థితి ఏంటంటూ ప్రజలు బెబేలెత్తిపోతున్నారు. అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో గరిష్టంగా 44.9 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే అత్యధిక జిల్లా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అయ్యింది. ఈ ఎండలు, ఉక్కపోత నుంచి ఏపీలో పలు జిల్లాల ప్రజలకు ఉపశమనం లభించనుంది. వాతావరణ శాఖ వచ్చే 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిది.

చాలా జిల్లాల్లో గత పది రోజులుగా ఎండలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయితే కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. మార్చి ఆఖరి వారం నుంచి తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వార్త ఆనందాన్ని ఇస్తోంది. కోస్తా, రాయలసీమ ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో చల్లని కబురు చెప్పారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ మాత్రమే కాకుండా.. ఆరోగ్య నిపుణులు కూడా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎండలో తిరగకపోవడమే మంచిది అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా నేరుగా ఎండలో తిరగొద్దని చెప్తున్నారు. గొడుగు తీసుకెళ్లడం లేదా క్యాప్ ధరించడం చేస్తే మంచిది అంటున్నారు. అలాగే కళ్లకు అద్దాలు, ఫుల్ హ్యాండ్స్ చేతులు, కాటన్ వస్త్రాలు ధరిస్తే మంచిదని చెప్తున్నారు. సాయంత్ర 4 గంటల వరకు బయటకు రాకపోవడమే ఉత్తమం అని చెప్తున్నారు. అలాగే శరీరం హైడ్రేడెట్ గా ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. కచ్చితంగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు, సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటే మంచిది.