కాలికి నల్లదారం కట్టడం వల్ల ఏం జరుగుతుంది?

ప్పటి తరంలో ఫ్యాషన్ ఎంత వేగంగా మారుతున్నా, కొన్నిపాత సంప్రదాయాలు మళ్లీ తిరిగి పాపులర్ అవుతున్నాయి. వాటిలో ఒకటి కాలికి నల్ల దారం కట్టుకునే అలవాటు.


ఒకప్పుడు పెద్దలు పిల్లలకు చెడు దృష్టి తగలకుండా కాలికి నల్ల దారం కట్టేవారు.నల్ల దారం చెడు శక్తిని దూరం చేస్తుందని చెబుతారు. అమ్మాయిలు ఎడమ కాలికి నల్ల దారం కడుతూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఇది కేవలం సంప్రదాయం కాదు, అందంతో కలిసి కొత్త ట్రెండ్‌గా మారింది.

పెద్దల ప్రకారం మాత్రం నల్లదారం చెడు దృష్టి నుండి రక్షణ ఇస్తుంది. ఒకవేళ ఎవరో మన మీద అసూయతో చూసినా లేదా నెగిటివ్ ఎనర్జీ కారణంగా మనకు ఏదైనా ఇబ్బంది వస్తుందని భావించినప్పుడు, నల్ల దారం ఆ దోషాన్ని అడ్డుకుంటుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా కాలి దగ్గర కట్టిన నల్ల దారం శరీరానికి దగ్గరగా ఉండే కారణంగా రక్షణ ఎక్కువగా ఇస్తుందని భావిస్తారు. పుట్టిన పిల్లలకు నల్ల చుక్క పెట్టడమో, దారం కట్టడమో నేటికీ జరుగుతూనే ఉన్న సంప్రదాయం.

శనిగ్రహంతో సంబంధం
జ్యోతిష శాస్త్రంలో కూడా నల్లదారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శని గ్రహం ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి నల్ల రంగు ఉపయోగపడుతుందని జ్యోతిష్యులు చెబుతారు. శని గ్రహ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి, భయం, అనిశ్చితి వంటి భావాలు తగ్గేందుకు నల్లదారం సహాయపడుతుందని వారు సూచిస్తారు. అందుకే కొందరు శని దోషం ఉన్నవారు, లేదా తమ జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నారని భావించే వారు నల్ల దారం కట్టుకోవడం ప్రారంభిస్తారు.

కొంతమంది నిపుణుల ప్రకారం కాలికి దారం కట్టుకోవడం వల్ల ఒక రకమైన గ్రౌండింగ్ ఎఫెక్ట్ వస్తుందని అంటారు. మన పాదాలు నేలతో నేరుగా కలుస్తాయి కాబట్టి శరీరం స్థిరపడటం, మనస్సు ప్రశాంతంగా ఉండటం జరుగుతుందని అంటారు. కాలి పై ఏదైనా వస్తువు తగిలి ఉండటం కూడా మనకు రక్షణ ఉన్న భావనను కలిగిస్తుంది. ఈ భావన చాలామందికి మానసిక శాంతి కలిగించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుందని చెప్పారు. భయం సహజంగా ఉండే పిల్లలు లేదా ఆందోళన ఎక్కువగా ఉండే పెద్దలు నల్ల దారం కట్టుకుంటే కొంత ధైర్యం వస్తుందని ప్రజల్లో నమ్మకం ఉంది.

ఇంటి పెద్దలు చెబుతున్న ప్రకారం నల్లదారం కట్టడం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గవచ్చని నమ్మకం ఉంది. ఉదాహరణకు కడుపు సమస్యలు, జీర్ణ సమస్యలు, కాళ్ల నొప్పి, నరాలు సమస్యలు వంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. అలాగే కాళ్లలో జరిగే ఏదైనా దోషం, నరాలకు సంబంధించిన చిన్న నొప్పులు కూడా తగ్గుతాయని కొందరు చెబుతారు. ఇవన్నీ శాస్త్రీయంగా రుజువు కాలేదు కానీ చాలా మంది నమ్మకం మాత్రం ఉంది. అలాగే ఎవరు ఏ కాలికి కట్టుకోవాలో కూడా ఒక పద్ధతి ఉంది. పురుషులు కుడి కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిదని, మహిళలు ఎడమ కాలికి కట్టుకుంటే శుభప్రదమని వారు చెబుతారు. పిల్లలకు సాధారణంగా ఎడమ కాలుకే కడతారు. ఇది పూర్తిగా సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడుతున్నా, ఇప్పటికీ చాలా మంది అలాగే పాటిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.