ఏం అవమానం జరిగిందని జగన్‌ అసెంబ్లీకి వెళ్లరు

అసెంబ్లీ సమావేశాలకు వెళ్ల నని జగన్‌ అనడం సరికాదని కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ప్రముఖ వ్యాపార సంస్థ జీఆర్‌టీ ఆర్థిక సహకారంతో సింహగిరిపై సుమారు రూ.1.5కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాల శంఖు, చక్ర, తిరునామాలను ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులుగా నందమూరి తారక రామారావు, చంద్రబాబు అసెంబ్లీలో తమకు జరిగిన అన్యాయాలకు మనస్తాపం చెంది సభకు వెళ్లమని ప్రతినబూనారని, జగన్‌కు అసెంబ్లీలో ఎటువంటి అవమానం జరగలేదని, ఎవరూ నిందించే పరిస్థితి కూడా లేదన్నారు. సమావేశాలకు ఎందుకు హాజరుకానంటున్నారో ఆయనకే తెలియాలన్నారు. సింహగిరిపై చేపడుతున్న ‘ప్రసాద్‌’ పనులపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో రెండు దేవాలయాల్లో చేపట్టిన పనులు చివరిదశకు చేరాయని, సింహాచలంలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు.