జెర్రీ కాటు వల్ల ప్రాణాపాయం ఏమీ లేకపోయినప్పటికీ.. తీవ్రమైన నొప్పి మాత్రం ఉంటుంది. ఒక వేళ జెర్రీ కుడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
జెర్రీ కుడితే కొంత నొప్పి, వాపు, ఇతర చిన్న లక్షణాలు కనిపించవచ్చు.
జెర్రి కాటుకు గురైన ప్రాంతాన్ని సబ్బు నీటితో కాటుకు గురైన ప్రాంతాన్ని బాగా శుభ్రం చేయండి. ఒక కోల్డ్ కంప్రెస్ లేదా మంచు ముక్కలతో చుట్టిన గుడ్డను కాటుకు గురైన ప్రాంతానికి అప్లై చేయండి. ఇది వాపు, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
కాటుకు గురైన భాగాన్ని శరీరం కంటే ఎత్తుగా ఉంచండి. ఇది వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. పారాసెటమాల్ వంటి నొప్పి నివారిణి మందులు తీసుకోవచ్చు.
పిండి చేసిన వెల్లుల్లిని కొద్ది మొత్తంలో నీరు లేదా క్యారియర్ ఆయిల్ (కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వంటివి) కలిపి పేస్ట్‌గా తయారు చేయండి. పేస్ట్‌ను నేరుగా కాటుకు అప్లై చేయండి. మొత్తం ప్రభావిత ప్రాంతాన్ని కవర్ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు కాటు మీద పేస్ట్ వదిలివేయండి. దీంతో ఫలితం ఉండవచ్చు. వెల్లుల్లి ఎలర్జీ ఉన్నవారు ఈ పద్ధతి ఉపయోగించకుంటే మేలు.
జెర్రి కాటు చాలా పెద్దగా ఉంటే.. కాటుకు గురైన ప్రాంతం ఎర్రబడి, వాపు పెరిగితే, జ్వరం, వికారం, అలర్జీ లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కాగా, జెర్రీల కాటు వల్ల సాధారణంగా తీవ్రమైన సమస్యలు ఉండవు. కొంతమందికి అలర్జీ ఉండే అవకాశం ఉంది. అలాంటి వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దురద, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.