దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) భారతీయ వినియోగదారుల్లో ఈవీ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల యాక్టివా ఇ (Activa e), క్యూసీ1 (Qc1)లను విడుదల చేసింది. ఇవి మార్కెట్లో ఇతర టూవీలర్లకు బలమైన పోటీగా నిలవనున్నాయి. ఆకట్టుకునే డిజైన్, మెరుగైన పెర్ఫామెన్స్‌తో కస్టమర్లకు కొత్త రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి. ఇటీవల మా డ్రైవ్‌స్పార్క్ టీం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ డ్రైవ్ చేసింది. వారికి రైడింగ్‌లో కలిగిన అనుభూతి గురించి కూడా క్షుణ్ణంగా వివరించాము. అయితే ఈ కథనంలో ఈ రెండు ఈవీ స్కూటర్ల మధ్య ఉన్న తేడాలు, సారుప్యతల గురించి వివరిస్తున్నాము.
బ్యాటరీ- రేంజ్: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5kWh కెపాసిటీ కలిగిన రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఛార్జింగ్ అయిపోయిన తరువాత వీటిని స్కూటర్ నుండి బయటకు తీసి ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో కంపెనీ స్వాపింగ్ పాయింట్ల వద్దకు వెళ్లి పాత బ్యాటరీని అక్కడ పెట్టి ఫుల్ ఛార్జింగ్ కలిగిన దాన్ని తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో 102 కి.మీ దూరం వరకు ప్రయాణిస్తుంది.
QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా 1.5kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ అందించారు. అయితే దీనిలో ఒక బ్యాటరీ మాత్రమే ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ రేంజ్ అందిస్తుంది. బాటరీని స్కూటర్ నుంచి బయటకు తీయడానికి వీలుండదు. 330W ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో 0-80శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు, పూర్తి ఛార్జ్ చేయడానికి 6 గంటల 50 నిమిషాలు పడుతుంది. డిజైన్- ధర: యాక్టివా-ఇ, క్యూసీ1 డిజైన్ పరంగా రెండు దాదాపు ఒకేలా ఉన్నట్లు కనిపిస్తాయి. యాక్టివా ఇ సాధారణ పెట్రోల్ యాక్టివాకు సమానమైన డిజైన్ కలిగి ఉంది. క్యూసీ1 ఫ్యుచరిస్టిక్, మోడర్న్ డిజైన్‌తో వచ్చింది. యాక్టివా ఇ కంటే కాంపాక్ట్‌గా ఉంటుంది. సిటీ రైడింగ్‌కు బాగా అనువైనది. యాక్టివా ఇ బాడీ ప్యానెల్స్ స్మూత్‌గా ఉండి, ఎక్కువ కట్స్ లేవు. ఫ్రంట్ ఎండ్ చూస్తే, ఇది చాలా షార్ప్‌గా ఉంది.
అదే క్యూసీ1 డిజైన్ యాక్టివా e ముందు భాగాన్ని పోలి ఉంది. హెడ్‌లైట్ యాక్టివా-ఇ లాగానే ఉన్నప్పటికి హ్యాండిల్‌బార్‌పై డీఆర్ఎల్ లేదు. కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌కు బదులుగా నెగటివ్ ఎల్సీడీ స్క్రీన్ అందించారు. క్యూసీ1 ప్రారంభ ధర రూ.90,000 నుండి మొదలవుతుంది. ఎక్స్ షోరూమ్ ధర. అలాగే యాక్టివా ఇ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.17 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ అయితే రూ.1.52 లక్షల వరకు ఉంది. ఇతర ఫీచర్స్: యాక్టివా-ఇ లో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్, సిడ్ స్టాండ్ మోటర్ కట్-ఆఫ్, రివర్స్ మోడ్, కీలెస్ స్టార్ట్, కనెక్టివిటీ ఫీచర్లు, వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 3 రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. అదే క్యూసీ1 స్కూటర్ 2 రైడింగ్ మోడ్స్‌ను కలిగి ఉంది. దీనిలో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 26-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, స్మార్ట్ కీకి బదులుగా సాధారణ అనలాగ్ యూనిట్ ఉంది.
యాక్టివా ఇ, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్రేకింగ్‌లో ప్రధాన తేడాలు ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లలో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ స్పెన్షన్ సెటప్ అందించారు. అలాగే, ఇవి అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్నాయి. యాక్టివా ఇ ముందు వీల్‌లో డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. అయితే QC1 స్కూటర్ డ్రమ్ బ్రేక్‌తో వచ్చింది.