Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎవరికి వారే జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు ఇక ఈ ప్రచారాలలో ఎవరి మాటలు వారివి ఎవరి లెక్కలు వారివని చెప్పాలి. ఇక ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పోటీ చేస్తున్నటువంటి నాయకులు అందరిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దవారని చెప్పాలి. కానీ వయసు తో సంబంధం లేకుండా చంద్రబాబు మాత్రం మిగిలిన ఏపీ అధినేతలతో సమానంగా ఉత్సాహంగా పర్యటన చేస్తూ ప్రచారాలు చేస్తున్న తీరు ఆంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులు సైతం చంద్రబాబును ముసలాడిగా ఎటకారం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కనబరుస్తున్న జోరు ప్రత్యర్థులను సైతం అవ్వాక్కు అయ్యేలా చేస్తుంది.
Chandrababu Naidu : చంద్రబాబు స్టామినా…
అయితే ప్రస్తుతం చంద్రబాబు వయసు 74 ఏళ్లు అయినప్పటికీ రాజకీయాల్లో ఆయన చూపిస్తున్న ఉత్సాహం చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్చి చూస్తే రాజకీయ పార్టీ నేతలు అందరూ కూడా చంద్రబాబు కంటే చాలా చిన్నవారు.ఇక అంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 55 సంవత్సరాలు ఉండగా , వైయస్ జగన్మోహన్ రెడ్డికి 51 సంవత్సరాలు ఉంటాయి. అంటే వీరిద్దరూ కూడా చంద్రబాబు కంటే 20 సంవత్సరాలు చిన్నవారే. వయసులో ఇంత తేడా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం రాజకీయాలలో వారికి సమానంగా ఉత్సాహం చూపుతూ పోటీపడుతున్నారు. అంతెందుకు ప్రస్తుతం వేసవికాలం కావడంతో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యువ నాయకులు సైతం ఎండ వేడికి తట్టుకోలేక సాయంత్రం వేళలో ప్రచారాలు చేస్తున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవల బస్సు యాత్రను సాయంత్రం వేళలో నిర్వహించారు. కానీ వయసులో అందరి కంటే పెద్దవాడు అయిన చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా పగలు రాత్రి తేడా లేకుండా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు కనబరుస్తున్న ఉత్సాహం చూసి యువ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. 74 ఏళ్ల వయసులో ఇంతలా శ్రమించడం అనేది కేవలం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని కొనియాడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కీలక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఫిట్ నెస్ అందర్నీ ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.