కర్మకాండల సమయంలో కాకులు ఎందుకు వస్తాయి.. సంబంధం ఏంటి?

కర్మకాండలకు, కాకి సంబంధమేంటనే చాలామందికి ఓ ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం రావణుడికి భయపడిన దేవతలు అందరూ ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారు.


లేడిలోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, తొండలోకి కుబేరుడు, యముడు కాకిలోకి ప్రవేశించాడు. రావణుడు వెళ్లిపోయిన అనంతరం ఆ జంతువుల శరీరం నుంచి బయటకు వచ్చి వాటికి మరణిస్తారు. లేడికి శరీరం అంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరాన్ని ఇంద్రుడు ప్రసాదిస్తాడు.

వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా నాట్యం ఆడేలా నెమలికి పించం వరుణుడు వరం ఇచ్చాడు. కాకికి బలవన్మరణం తప్ప స్వతాహగా మరణం ఉండదని యముడు వరమిచ్చాడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండమైతే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని యముడు చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహారం ఇస్తుంటారు. కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకి చేరుతుందని ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారు. పితృ కర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా మిగిలిన సమయాలలో కూడా పక్షులకి ఆహారం అందించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో కాకులు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో పెరట్లోనూ, ఇంటి పైకప్పు మీద పిండాలు కాకులకు పెడుతూ ఉండేవారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.