వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గాజు వస్తువులను ఉంచడానికి ఉత్తమమైన దిశలు తూర్పు, ఉత్తరం. ఈ దిశల్లో గాజు వస్తువులను ఉంచడం వల్ల ఇంటికి శాంతి, ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తాయి.
ఉత్తర దిశ లక్ష్మీదేవికి సంబంధించినది, కాబట్టి ఇక్కడ గాజు వస్తువులను ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, గాజు వస్తువులను దక్షిణ దిశలో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ దిశలో గాజు వస్తువులను ఉంచడం వల్ల ఇంటికి అశుభం వస్తుంది. ఇది ఇంటికి నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, కొన్నిసార్లు అనుకోకుండా ఇంట్లో గాజు వస్తువులు పగులుతాయి. ఇలా గాజు వస్తువులు పగలడం శుభమా? అశుభుమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గాజు పగలడం మంచిది కాదు. పగిలిన గాజు వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి, పగిలిన గాజు వస్తువులను వెంటనే తొలగించడం మంచిది.
ఇది జీవితంలో దురదృష్టం, అడ్డంకులను కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గాజు పగలడం అంటే ఏమి సూచిస్తుందో తెలుసుకుందాం..
* వాస్తు శాస్త్రం ప్రకారం, పగిలిన గాజు ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, అశాంతి, కుటుంబ కలహాలను పెంచుతుంది.
* గాజును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో పగిలిన గాజు ఉంచుకోవడం ఆమెకు అవమానంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఆర్థిక నష్టం, పేదరికం భయం కలుగుతుంది.
* పగిలిన గాజు గందరగోళం, అసమతుల్యతను సూచిస్తుంది. ఇది మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఆందోళన, కోపం, చిరాకును పెంచుతుంది.
* పగిలిన గాజు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలలో ఉద్రిక్తత, దూరాన్ని తెస్తుందని వాస్తు శాస్త్రం నమ్ముతుంది. ఇది ప్రేమ, సామరస్యాన్ని ప్రభావితం చేస్తుంది.
* పగిలిన గాజు ఇంట్లో శుభ కార్యాలు, సానుకూల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది వ్యక్తి పనిలో పదే పదే అడ్డంకులను సృష్టిస్తుంది.* ఇంట్లో అద్దం పగిలిపోతే అది చాలా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది.