ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో WiFi connection నిత్యావసరంగా మారింది. అయితే, WiFi network ను hack చేసే అవకాశం ఉంది. అందువల్ల, మీ WiFi network hack కాకుండా ఉండాలంటే, ఈ ఐదు జాగ్రత్తలు తీసుకోండి.
Internet plan subscribe చేసేటప్పుడు మనం చాలా research చేస్తుంటాం. తక్కువ ధరలో లభించే best deals కోసం, వేగవంతమైన internet కోసం చూస్తుంటాం. Downtime తక్కువ ఉండాలని, reliable company అయి ఉండాలని చూస్తాం. కానీ, దురదృష్టవశాత్తు, మనం ఒక key aspect కి అదే level priority ఇవ్వం. అదే ఆ WiFi network security.
WiFi network security
ఈ రోజుల్లో, మీ WiFi network కు secure గా ఉంచడం చాలా important. ముఖ్యంగా daily life లో WiFi network ను ఉపయోగించి మన smartphones, laptops, smart home appliances లో చాలా activities చేస్తుంటాం.
Banking transactions, credit cards ఉపయోగించడం, friends, family members తో private conversations చేయడం వంటివి ఇప్పుడు online లోనే ఎక్కువగా చేస్తున్నాం. మరి ఆ data ఎంతవరకు secure గా ఉంటుందో కూడా చూసుకోవాలి కదా..
Hack చేస్తే..
ఒకవేళ ఎవరైనా hacker మీ WiFi network ను hack చేసి, మీ WiFi system ను తన control లోకి తీసుకుంటే ఎంత chaos situations ఏర్పడుతాయో ఆలోచించండి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీ WiFi network ను secure గా ఉంచడానికి, hackers మీ WiFi system ను hack చేయకుండా ఉండడానికి సహాయపడే ఐదు best tips ఇక్కడ ఉన్నాయి.
1. మీ WiFi network default SSID ను మార్చండి
మీరు కొత్త WiFi router ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, అది default SSID (network name) తో వస్తుంది. మీరు ఈ SSID పేరును వెంటనే మార్చాలి. ఎలాంటి personal information ను బహిర్గతం చేయని SSID ని ఎంచుకోండి.
2. Strong WiFi password ఉపయోగించండి
SSID మాదిరిగానే, మీ router కూడా default password తో వస్తుంది. దీనిని easily guess చేయవచ్చు. అందువల్ల, మీరు WiFi network ను ఉపయోగించడం ప్రారంభించగానే ముందుగా ఎవరూ guess చేయలేని strong password ను ఎంచుకోవాలి. Passwords ను create చేయడానికి, store చేయడానికి password manager ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు, Apple Passwords app లేదా Google వైపు కూడా అనేక free options అందుబాటులో ఉన్నాయి. మీ password కనీసం 15 characters ఉండేలా చూసుకోండి. ఇది numbers, letters, symbols మిశ్రమంగా ఉందని నిర్ధారించుకోండి.
3. మీ router software ను updated గా ఉంచుకోండి
Bugs లేదా security vulnerabilities ను fix చేయడానికి మీ smartphone ను update చేసినట్లే, router manufacturers కూడా issues ను patch చేయడానికి software updates ను release చేస్తారు. అయినప్పటికీ, చాలా మంది దీనిని పట్టించుకోరు. Initial setup తర్వాత వారి routers ను touch చేయకుండా వదిలేస్తారు. Updates కోసం regularly check చేయండి. Available ఉన్నప్పుడు వాటిని install చేయండి. ఎందుకంటే అవి hackers ఉపయోగించగల tools ను disable చేస్తాయి.
4. Extra privacy కోసం VPN ఉపయోగించండి
మీ privacy ను protect చేయడానికి VPNs అత్యంత effective గా ఉంటాయి. అవి మీ IP address ను internet నుండి hide చేయడమే కాకుండా, అవి మీ internet activity ను encrypt చేస్తాయి. ఇది మీ personal information ను access చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరికైనా barrier గా నిలుస్తుంది. అంటే మీ online activity, WiFi లో కూడా private గా, secure గా ఉంటుంది. Hackers కు దూరంగా ఉంటుంది.
5. Better router ను కొనండి
మీ ISP provide చేసే default router ను ఉపయోగించడానికి బదులుగా high-quality router కు upgrade అవండి. దానివల్ల better speed, reliability, extended range, enhanced security వంటి అనేక advantages లభిస్తాయి. Generally, many models in-built firewalls తో వస్తాయి.