టాప్ ఐటీ కంపెనీల్లో మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. రీసెంట్‌గా టీసీఎస్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, క్యాప్ జెమిని, డెలాయిట్ వివిధ డొమైన్లలో పోస్టులను భర్తీ చేశాయి.
తాజాగా, ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ (Intel) కూడా భారీగా ఉద్యోగాలను ఫిల్ చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home Jobs Intel) ఫెసిలిటీతో వివిధ పొజిషన్ల కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను ఇన్వైట్ చేస్తోంది.
దేశ వ్యాప్తంగా ఉన్న ఇంటెల్ బ్రాంచీల్లో ఎక్కడైనా పనిచేసుకునే వీలు కల్పిస్తూ ఎంట్రీ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్ వరకు (Entry Level to Senior Level Hiring) హైరింగ్ చేపడుతోంది. కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ :
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా (Software Development Engineer).. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, డ్రైవర్స్ డిజైన్ చేసి డెవలప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. Java, C++, Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వీటితో పాటు.. ప్రాబ్లెమ్ సాల్వింగ్ ఎబిలిటీ, టీమ్‌తో కలిసి డెడ్‌లైన్ లోగా వర్క్ ఫినిష్ చేసే టాలెంట్ ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుంది. టాలెంట్, పనితనం బట్టి శాలరీ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో సగటుగా రూ.3 నుంచి రూ.9 లక్షల వరకు యాన్యువల్ ప్యాకేజీ ఉంది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, టీమ్ లీడ్, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, మేనేజర్ స్థాయి వరకు ఎదగొచ్చు.
* టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ :
సర్వీస్, ప్రొడక్ట్‌లకు సంబంధించి ఇంటెల్ కస్టమర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్‌ని (Technical Support Specialist) కంపెనీ హైర్ చేసుకుంటోంది. సమస్యను గుర్తించి అందుకు తగిన సమాధానాలు కస్టమర్లకు అందించడం, అవసరమైతే వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించడం వంటివి చేయాలి.
టెలిఫోన్, చాట్, ఇమెయిల్‌లో కస్టమర్ల ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వాలి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. పీసీ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్‌పై గట్టి పట్టు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవసరం.
సేల్స్ రిప్రజెంటేటివ్ :
క్లైంట్స్‌కు ఇంటెల్‌కి చెందిన ప్రొడక్టులు, సర్వీసులను వివరించి వాటిని ప్రమోట్ చేయడం, అమ్మడం సేల్స్ రిప్రజెంటేటివ్ (Sales Representative) బాధ్యత. క్లైంట్ల అవసరాలను తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి. బిజినెస్, మార్కెటింగ్, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్‌తో పాటు మార్కెటింగ్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్‌ని బట్టి శాలరీ ఉంటుంది. జాబ్‌లో చేరిన తర్వాత బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తే ఎడిషనల్ బెనిఫిట్స్ అందుతాయి.
* డేటా అనలిస్ట్
క్లిష్టమైన డేటాను విశ్లేషించి కంపెనీకి తగిన సమాచారాన్ని అందించే వారికోసం కంపెనీ వెయిట్ చేస్తోంది. డేటా అనలిస్టులుగా (Data Analyst) ట్రెండ్స్‌ని పరిశీలించి అందుకు తగిన ఇన్‌ఫర్మేషన్‌ని ప్రిపేర్ చేయాలి. రికార్డులను కలెక్ట్ చేసి స్టడీ చేయడం, వాటితో ఎవల్యుయేషన్, విజువలైజేషన్‌ని డెవలప్ చేయడం వంటివి హ్యాండిల్ చేయగలగాలి. డేటా సైన్స్, స్టాటస్టిక్స్, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. SQL, Excel, Tableau లో ప్రొఫిషియన్సీ ఉండాలి.