సొలాల బిర్యానీ రుచి చూస్తారా?

మటన్, చికెన్, వెజ్‌.. బిర్యానీలు తిని ఉంటారు. మరి సొలాల బిర్యానీ? అదేంటి అదెక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? ఈ వంటకానికి ఆదిలాబాద్‌ ప్రసిద్ధి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించదండోయ్‌..! కంది పంట లేతకాయతో చేతికొచ్చినప్పుడు మాత్రమే లభిస్తుంది.. కందికాయకు బిర్యానీకి సంబంధమేంటని ఆశ్చర్యపోనక్కర్లేదు.. లేత కందికాయను పొట్టు తీస్తే అందులోని బీన్స్‌నే ఆదిలాబాద్‌ మాండలికంలో సొలాలు అంటారు. వాటితో తయారయ్యేదే ఆదిలాబాద్‌ స్పెషల్‌ సొలాల బిర్యానీ. బిర్యానీకి కావాల్సిన అన్ని దినుసులతో తాలింపు వేసి.. డీప్‌ ఫ్రై అయ్యాక అందులో నీళ్లు పోయాలి.. కాసింత మరిగాక కంది బీన్స్‌తో పాటు బియ్యం వేసి ఉడికిస్తే ఇది రెడీ అవుతుంది. కిలో బియ్యంతో చేసే బిర్యానీలో అరకిలో సొలాలు కలిపితే వంటకం బాగా రుచిగా ఉంటుందంటారు ఆదిలాబాద్‌కు చెందిన గృహిణి లక్ష్మి.. అక్టోబరులో కంది కాత వస్తుంది. మరి మీరూ ఓ పట్టు పట్టేస్తారా?


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.