BREAKING: వైసీపీ నవరత్నాల గుడి ధ్వంసం.. శ్రీకాళహస్తిలో టెన్షన్.. టెన్షన్

హోరాహోరీగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 సీట్లలో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.


వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను తలుచుకుంటూ.. ఇన్నాళ్లు లోలోపలే మథనపడిన తెలుగు తమ్ముళ్లు తాము అధికారంలోకి వచ్చామని సంతోషంతో వారి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం హయాం శంకుస్థాపన చేపట్టిన శిలాఫలాకాలు ధ్వంసం చేయడం, పేర్లు తొలిగించే పనులు చేస్తున్నారు. తాజాగా ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ శ్రీకాళహస్తిలో నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానిక వైసీపీ నాయకులు ఘటనపై పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితులను పట్టుకునేందుకు గుడి దగ్గర్లో ఉన్న సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.