Ap Elections: ఉద్యోగుల postal ballot పై హైకోర్టుకు YCP
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల(Postal ballot) చెల్లుబాటు అంశంలో హైకోర్టు(High court)ను వైసీపీ ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిక్లరేషన్‌పై గెజ్జిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని చెప్పడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఈ మెమోలు కొట్టివేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఉద్యోగులంతా కూటమి వైపు మెుగ్గు చూపడంతోనే వైసీపీ హైకోర్టుకు వెళ్లిందని తెదేపా నేతలు చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాబు కాకుండా చూసేందుకు వైసీపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు. ఉద్యోగులంతా కూటమి మద్దతు తెలుపుతున్నారని, ఆ విషయం వైసీపీ అధిష్ఠానానికీ తెలుసన్నారు. అందుకే ఓట్లు చెల్లుబాటు కాకుండా చేసి తమ ఓటు శాతాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే హైకోర్టును ఆశ్రయించారని మండిపడుతున్నారు.