ఈ వారం బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరో ఫైట్.. లిస్టు ఇదే

www.mannamweb.com


దేశంలో కరోనా సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం పూర్తిగా కుదేలైంది. దేశ వ్యాప్తంగా థియేటర్లు బంద్ చేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మెల్లి మెల్లిగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం పుంజుకుంటూ వస్తుంది. ఇటీవల స్టార్ హీరోలు ఏడాదికి ఒకటీ రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ప్రతి సంవత్సరం పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న హీరోల సందడి నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా ఆదరిస్తారు టాలీవుడ్ ప్రేక్షకులు. ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలవుతుంది.. ఈ వారం కొత్త సినిమాలతో పాటు ఓ పాత సినిమా కూడా థియేటర్లో సందడి చేయబోతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. రిలీజ్ అయిన రోజునే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జ కాంబినేషన్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది.చిదంబరం దర్శకత్వంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ మాలీవుడ్ చరిత్రలో భారీ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే మరికొన్ని సినిమాలు చిన్న బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని, సమంత కెరీర్ బిగినింగ్ లో జంటగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీతో పాటు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

అశ్విన్ బాబు, దిగంగనా సూర్య వంశి నటించిన మూవీ – శివంభజే : ఆగస్టు 1

వ‌రుణ్ సందేశ్ నటిస్తున్న – విరాజీ : ఆగస్టు 2

అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ నటించిన మూవీ – బడ్డీ : ఆగస్టు 2

నాని, సమంత నటించిన -ఎటో వెళ్లిపోయింది మనసు : ఆగస్టు 2

విజయ్ ఆంటోనీ నటించిన – తుఫాన్ : ఆగస్టు 2

జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య నటించిన – ఉలఝ్ : ఆగస్టు 2

శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష నటించిన – ఉషా పరిణయం : ఆగస్టు 2

రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నటించిన – తిరగబడరాసామీ : ఆగస్టు 2

కృష్ణ వంశి, మోక్ష – అలనాటి రామచంద్రుడు : ఆగస్టు 2