118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్‌ డైట్‌తో

అధిక బరువుతో ఉండే వ్యక్తులు వారి వ్యక్తిగత బాధలు, శారీరక అనారోగ్యం కంటే చుట్టూ ఉండే వారు ఏమనుకుంటారో అనేదానితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అవమానాలు, వెక్కిరింపుల ఎదుర్కోవాలంటే బరువు తగ్గాల్సిందే అనుకుంటారు.


కానీ బరువు తగ్గాలి.. తగ్గాలి.. స్మార్ట్‌గా ఉండాలి, నచ్చిన బట్టలువేసుకోవాలి, పార్టీలకు, ఫంక్షన్లకు అందంగా వెళ్లాలి అని అనుకుంటూ సరిపోదు. దానికి తగ్గట్టుగా కఠోర శ్రమ చేయాలి. బాడీ వెయిట్‌కు తగ్టట్టు ఎంత బరువు తగ్గాలి అనేది అంచనా వేసుకుని నిపుణుల సలహా మేరకు ముందుకు సాగాలి. అలా 6-7 నెలల్లో 118 కిలోల నుండి 80 కిలోలకు చేరిన యువకుడి స్టోరీ గురించి తెలుసుకుందాం.

నోయిడాలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు రజత్ బన్సల్ (30). ఫ్రెండ్స్‌ వేళాకోళాలతో పాటు, అద్దంలో తనను తాను చూసుకుని బాధపడేవాడు. 118 కిలోల బరువు పెరగడం అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా, మానసికంగా అతడ్ని బలహీనుడిని చేసింది. నచ్చిన బట్టలు వేసుకోవడానికి లేదు. దర్జాగా పెళ్లికో, ఫంక్షనకో వెళ్లాలంటే..సిగ్గుగా ఉండేది. బంధువుల మాటలు, స్నేహితుల జోకులు మరింత బాధించేవి. అంతే వన్‌ ఫైన్‌ మార్నింగ్‌ కేవలం బరువు తగ్గాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కేవలం 6-7 నెలల్లో 38 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించు కున్నాడు.

ఏలా ఊపిరాడుతోందిరా బాబూ
రజత్‌ వెయిట్‌ లాస్‌ జర్నీలో ఫ్రెండ్స్‌ జోకులు, ఎగతాళి మాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు ‘నువ్వు చాలా బరువు పెరిగావు, ఏ బట్టలు ధరిస్తావు?’ ‘ఎలా నడుస్తావ్‌.. ఊపిరి ఆడుతోందా? అంటూ అని ఎగతాళి చేసేవారు. చివరికి నోయిడాలోని డైట్ మంత్ర క్లినిక్‌కు చెందిన డైటీషియన్ డాక్టర్ కామిని సిన్హా, రజత్ బరువు తగ్గి, ఫిట్‌గా ఉండేందుకు రంగంలోకి దిగాడు.

జంక్ ఫుడ్ – స్వీట్లు వీక్‌నెస్‌
రజత్‌కు అతిపెద్ద సవాలు ఏమిటంటే జంక్ ఫుడ్ , స్వీట్లు తినే అలవాటు మార్చుకోవడం. ఏది ఏమైనా సరే తన లైఫ్‌,ఆరోగ్యంతో రాజీపడకూడదని నిర్ణయించుకున్నాడు.ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చేసుకున్నాడు.

ఉదయాన్నే మార్నింగ్‌ వాక్‌ కు వెళ్లేవాడు.చెమటలు పట్టేదాకా వ్యాయామం మెట్లు ఎక్కడం చేసేవాడు.
అల్పాహారం: ఉడికించిన ఓట్స్ లేదా పోహా.

మధ్యాహ్నం: ఉడికించిన పప్పులు, సలాడ్ మరియు పెరుగు.

సాయంత్రం 4 గంటలు: కాల్చిన చిక్‌పీస్ , పండ్లతో భేల్.

రాత్రి భోజనం: ఫ్రూట్ రైతా , సలాడ్.

దీనితో పాటు హోం చిట్కాలు కూడా పాటించాడు. మెంతులు, సోంపు, జీలకర్ర, క్యారమ్ గింజలు ,దాల్చిన చెక్కను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఉడకబెట్టి, ఉదయం సగం గ్లాసు , రాత్రి సగం గ్లాసు తాగేవాడు.

తొలి వారాల్లో చాలా కష్టపడేవాడు. ఆకలిని తట్టుకోవడం కష్టంగా ఉండేది. చాలా నీరసంగా అనిపించేది. కానీ వెక్కిరింపులు, వేళాకోళాలు గుర్తొచ్చేవి. అద్దంలో తగ్గిన వెయిట్‌ చూసుకొని ఉత్సాహాన్ని తెచ్చుకునేవాడు. అలా శరీరంలో మాత్రమే కాదు, మనస్సులో ఉత్సాహంలో కూడా వచ్చిన మార్పు గమనించి మరింత పట్టుదలగా సాగాడు.

6-7 నెలల కృషి తర్వాత, తన బాడీ వెయిట్‌ 80 కిలోలకు చేరేసరికి కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, గౌరవం కూడా తిరిగి వచ్చింది. ఎందుకు బరువు తగ్గడం నీ వల్ల కాదురా అని హేళన చేసినవాళ్లంతా ‘నువ్వు ఇంత బరువు ఎలా తగ్గావు?’ అని ఆశ్చర్యపోవడమే రజత్‌ వెయిట్‌ లాస్‌లో జర్నీలో పెద్ద సక్సెస్‌..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.