బయటకు ఏ రంగంలోనైనా 60ఏళ్లు వయసు వచ్చిందంటే రిటైర్‌మెంట్ తీసుకుంటారు. కానీ సినిమాల్లో అలా కాదు, ఇంకా హీరోగా చేస్తున్నారు. వందల కోట్లు కలెక్షన్లు సాధిస్తున్నారు. మరి 60 ప్లస్‌లోనూ 300కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన హీరోలెవరో చూద్దాం.
యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో దమ్ములేపుతున్నారు. ఐదు వంద కోట్లు, వెయ్యి కోట్లు, 1500కోట్ల ఇలా అవలీలగా సాధిస్తున్నారు. రాబోతున్న సినిమాలు కూడా పలు సంచలనాత్మక మూవీస్ ఉన్నాయి. అవి ఈజీగా రెండు వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.
కానీ సీనియర్ హీరోల విషయంలో ఇది కష్టమనే చెప్పాలి. వారి సినిమా వంద కోట్లు, రెండు వందల కోట్లు కలెక్ట్ చేయడం గొప్పగా మారింది. 60ఏళ్లు దాటిన సౌత హీరోల్లో రూ.300 కోట్లు సాధించిన స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
60 దాటిన హీరోల్లో ఈ ఘనత సాధించిన హీరోల్లో రజనీకాంత్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన `రోబో`, `2.0` చిత్రాలతోనే ఈ అరుదైన ఘనత సాధించారు. `రోబో` మూవీ 300కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది.
ఇక `జైలర్`తో సంచలన రికార్డు క్రియేట్ చేశారు రజనీకాంత్. ఈ మూవీ సుమారు. రూ.650కోట్ల కలెక్షన్లని సాధించింది. 350కోట్లకుపైగా షేర్ సాధించింది. ఇప్పుడు `కూలీ`తో వెయ్యి కోట్లు టార్గెట్ చేశారు రజనీకాంత్.
ఆ తర్వాత 60ఏళ్లు దాటిన హీరోల్లో 300కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన హీరోల్లో కమల్ హాసన్ ఉన్నారు. ఆయన మూడేళ్ల క్రితం `విక్రమ్` మూవీతో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ మూవీ సుమారు రూ. 350కోట్లు వసూలు చేసింది. కమల్‌కి కాసుల వర్షం కురిపించింది. `భారతీయుడు 2`తో డిజప్పాయింట్ చేసిన ఆయన `థగ్ లైఫ్` మూవీతో మరోసారి భారీ కలెక్షన్లపై కన్నేశారు. మరోవైపు `కల్కి 2898 ఏడీ`లోనూ నటించి వెయ్యి కోట్లు సాధించిన చిత్రంలో భాగమయ్యారు.
సౌత్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఈ ఘనత సాధించింది కేవలం వెంకటేష్ మాత్రమే. ఆయన ఇటీవల సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తెలుగులో సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో వెంకీ కావడం విశేషం. చిరంజీవి, బాలయ్య, నాగ్‌లు కూడా ఈ ఘనత సాధించలేదు.