ఏపీ పదో తరగతి ఫలితాలలో 600కు 599 మార్కులు.. ఈ విద్యార్థిని గ్రేట్ అంటూ

పదో తరగతి పరీక్షలో( Tenth Class Exams ) మంచి మార్కులు సాధించడం ప్రతి విద్యార్థి కల అనే సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు( AP 10th Results ) విడుదల కాగా 6,16,000 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావడం జరిగింది.
అయితే ఈ ఫలితాలలో స్టేట్ టాపర్ గా ఆకుల వెంటక నాగ సాయి మనస్వి( Akula Ventaka Naga Sai Manasvi ) నిలిచారు. 600 మార్కులు నాగసాయి మనస్వి 599 మార్కులు సాధించడం గమనార్హం.


ఈ విద్యార్థిని గ్రేట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్ట్ లలో ఈ విద్యార్థిని నూటికి నూరు మార్కులు సాధించారు. ఏలూరు జిల్లాకు( Eluru District ) చెందిన ఈ విద్యార్థిని బాల్యం నుంచి చదువులో ముందువరసలో ఉండేవారని తెలుస్తోంది. స్టేట్ టాపర్ గా( State Topper ) నిలవడంతో మనస్వి సంతోషానికి అవధులు లేకుండా పోయాయని భోగట్టా.

పది పరీక్ష ఫలితాలలో మనస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని ఎస్సెస్సీ బోర్డ్ ప్రకటించడం గమనార్హం. మనస్వి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె చదివిన స్కూల్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నెటిజన్లు మనస్వికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయిందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ లో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థిని టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.

మనస్వి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలియాల్సి ఉంది. మనస్వి లాంటి విద్యార్థినులు ఈ సమాజానికి ఎంతో అవసరమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మే నెల 24వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మనస్వి సక్సెస్ స్టోరీని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. మనస్వి మరెన్నో విజయాలను అందుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నూజివీడు MPPS అన్నవరం MAIN లో పని చేస్తున్న ANV ప్రసాద్ గారు చాట్రాయి మండలం MPPS సోమవరం లో పనిచేయుచున్న శైలజగారు దంపతుల కుమార్తె SSC ఫలితాలలో 599/600 మార్కులతో STATE 1 ర్యాంక్ సాధించిన సందర్భంగా కుమారి ఆకుల వెంకట నాగ మనస్వి మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల తరపున హృదయ పూర్వక అభినందనలు & శుభాకాంక్షలు..