Petrol Diesel Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలపై వాటి ప్రభావం ఉండడం లేదు.
మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రివ్వున పైకి ఎగిరాయి. ప్రస్తుతం, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.06 డాలర్లు తగ్గి 77.10 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.04 డాలర్లు పెరిగి 81.15 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.