వెకేషన్స్ లేదా ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు వెంట కెమెరా ఉండాల్సిందే. మొబైల్ కెమెరా ఉంది కదా.. ఇంకా సెపరేట్‌గా కెమెరా ఎందుకని అనుకోవచ్చు. కానీ ఫోన్‌తో కంపేర్ చేస్తే కెమెరాల్లో వచ్చే ఫొటో క్వాలిటీ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. ఇప్పుడంటే అందరూ ఫోన్ కెమెరాలను వాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేయడానికి కెమెరాలనే ఉపయోగించేవారు. కెమెరా ఇంట్లో ఉంటే అదో స్టేటస్ సింబల్‌లా భావించేవారు. ఎక్కడైనా టూర్లకు లేదా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు వెంట కెమెరా తీసుకెళ్లేవారు. దాంతో తీసిన ఫొటోలను తర్వాత ఆల్బమ్స్లా చేయించి ఇంట్లో భద్రంగా దాచుకునేవారు.
క్రమంగా మొబైల్ వాడకం పెరగడం, ఆయా కంపెనీలు సూపర్ క్వాలిటీ కెమెరా ఆప్షన్లతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడంతో కెమెరాల వాడకం తగ్గింది. అయితే ఇప్పటికి కూడా కెమెరాలు వాడేవారు చాలా మందే ఉన్నారు. ఫొటోలు తీసే హాబీ ఉన్నవారు మంచి క్వాలిటీ కోసం కెమెరాల మీదే ఆధారపడుతున్నారు. అయితే మునుపటిలా కాదు.. ఇప్పుడు కెమెరా తయారీల్లో అప్‌గ్రెడేషన్ పెరిగింది. యంగ్ జనరేషన్ ఇష్టపడేలా వాళ్ల టేస్ట్‌కు తగ్గట్లు హైక్వాలిటీ ఇమేజెస్, లో లైట్‌లోనూ మంచి క్వాలిటీతో ఫొటోస్ తీసేలా కెమెరాలను రూపొందిస్తున్నారు. అలాంటి అడ్వాన్స్డ్ కెమెరాపై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. 55 వేల ఖరీదు చేసే 5కే కెమెరా 21 వేలకే వస్తోంది.
గో ప్రో కంపెనీకి చెందిన వాటర్‌ప్రూఫ్ యాక్షన్ 5డీ కెమెరాపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.54,500 ఖరీదు చేసే ఈ కెమెరా మీద 58 శాతం డిస్కౌంట్‌తో రూ.22,990కే ఇస్తున్నారు. ఎస్బీఐ కార్డు మీద తీసుకుంటే ఇంకో రూ.2,174 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు రూ.20,990కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ వాటర్‌ప్రూఫ్ కెమెరాను నీళ్లలో 33 ఫీట్ల లోతు వరకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ప్రీమియం కెమెరా కావాలనుకుంటే సోనీ ఆల్ఫా ఐఎల్సీఏ-7ఎం3 బెస్ట్ ఆప్షన్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రూ.1,67990 విలువ చేసే ఈ కెమెరా ఇప్పుడు ఆఫర్ కింద రూ.1,27,489కి వస్తోంది. ఇంకా హై రేంజ్ కెమెరా కావాలనుకుంటే సోనీ ఆల్ఫా ఐఎల్సీఏ-7ఎం4 మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ 33 మెగాపిక్సల్ కెమెరా అసలు ధర రూ.2,47,990. కానీ ఇప్పుడు ఆఫర్ కింద రూ.2,09,990కి అందుబాటులో ఉంది.