ధర తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. జియో చీపెస్ట్ రీచార్జ్ ప్లాన్లు ఇవే..

www.mannamweb.com


నాలుగు ప్లాన్లు.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలో సరసమైన ధరలకు పెట్టింది పేరు. అయితే ఇటీవల ప్లాన్ల రేట్లను పెంచడంతో అన్ని ప్లాన్లు అప్ డేట్ అయ్యాయి. వాటిల్లో తక్కువ ధరలకు వివిధ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్న నాలుగు ప్లాన్లను మీకు అందిస్తున్నాం.

జియో రూ. 199 ప్లాన్.. ఈ ప్లాన్లో 1.5జీబీ రోజువారీ డేటా (మొత్తం 27జీబీ), అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లతో 18 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జియో రూ. 209 ప్లాన్.. ఈ ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో 1జీబీ రోజువారీ డేటా (మొత్తం 22జీబీ) వస్తుంది. అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌లకు యాక్సెస్‌ ఇస్తుంది.

రూ. 249 ప్లాన్.. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 1జీబీ రోజువారీ డేటా (మొత్తం 28జీబీ) అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌లకు యాక్సెస్ ఇస్తుంది.

రూ. 299 ప్లాన్.. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి రోజూ 1.5జీబీ రోజువారీ డేటా (మొత్తం 42జీబీ)ని అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.