మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. Google Pixel 7 ఫోన్‌పై రూ.27 వేల తగ్గింపు

www.mannamweb.com


గూగుల్ ఇటీవలే పిక్సెల్ 9 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ మూడు ఫోన్‌లను విడుదల చేసింది కంపెనీ. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్‌లు ఉన్నాయి.

ఈ సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత, గూగుల్ తన పాత పిక్సెల్ 7 సిరీస్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. మీరు ఈ Google ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు ఉత్తమ సమయం.

గూగుల్‌ పిక్సెల్‌ 7 సిరీస్‌లో Pixel 7, Pixel 7A, Pixel 7 Pro అనే మూడు కొత్త ఫోన్‌లను విడుదల చేసింది. Pixel 7పై అందుబాటులో ఉన్న తగ్గింపు గురించి తెలుసుకుందాం. గూగుల్‌ పిక్సెల్‌ 7 అధికారిక ధర రూ. 59,999. దీనిని ప్రస్తుతం 45 శాతం తగ్గింపుతో కేవలం రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.

ఇతర ఆఫర్‌లు

డైరెక్ట్ డిస్కౌంట్ కాకుండా, Google Pixel 7లో అనేక ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిలో మీరు Google Pixel 7 ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 27,000 అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, మీరు అనేక బ్యాంక్ ఆఫర్‌లలో ఇతర తగ్గింపులను కూడా పొందుతారు. ఈ ఫోన్‌లపై ఈ తగ్గింపు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్టు నుండి పొందవచ్చు.