ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..

www.mannamweb.com


దేశ‌వ్యాప్తంగా ఫేక్‌ క‌రెన్సీ క‌ల‌క‌లం రేపుతోంది. కేటుగాళ్లు న‌కిలీ నోట్ల‌ను ముద్రించి మార్కెట్‌లో చ‌లామ‌ణీ చేస్తున్నారు. అయితే వీరిని ప‌ట్టుకోవ‌డం పోలీసుల‌కు క‌త్తి మీద సాములా మారింది. దీనిపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతోంది. అయితే న‌కిలీ నోట్ల‌కు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మ‌దాబాద్ పోలీసులు రెండ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.
Anupam Kher: ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..

ఆ ముఠా ద‌గ్గ‌రున్న నోట్ల‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఫేక్‌ నోట్ల ముఠా వద్ద దొరికిన 5 వందల రూపాయల నోట్ల‌లో మ‌హాత్మ గాంధీకి బ‌దులుగా బాలీవుడ్ నటుడి బొమ్మ ఉంది. అవును బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో ఉంది. అలాగే ఈ నోట్ల‌పై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు.

ఈ నోట్ల‌ను ఉప‌యోగించి బంగారం కొన‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యంలో ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వ‌ద్ద నుంచి ఒక కోటి 60 లక్షల విలువైన ఫేక్ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 5 వందల రూపాయల నోటుపై అనుప‌మ్ ఖేర్ ఫోటో ఉండ‌డంతో దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ విష‌యం అనుపమ్ ఖేర్ ద‌గ్గ‌రికి కూడా వెళ్ల‌గా.. అత‌డు స్పందిస్తూ.. 5 వందల నోట్ల‌పై గాంధీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.