సెలెబ్రిటీలు సైతం ఇష్టపడే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ధర కూడా తక్కువే..

www.mannamweb.com


మన దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. పర్యావరణ హిత ప్రయాణంతో పాటు మెయింటెనెన్స్ లేకపోవడం, లోకల్ అవసరాలకు చక్కగా సరిపోతుండటంతో అందరూ వీటిని ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల తన గ్యారేజీకి బీగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్‌ తీసుకొచ్చారు. ముంబైలోని విల్లే పార్లే నుంచి అర్జున్ తన కొత్త రైడ్‌ను ప్రారంభించి, అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన వద్ద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బీగాస్ కంపెనీకి చెందినది. పూర్తి మెటల్ బాడీతో కూడిన ఆర్‌యూవీ ఇది. ఆర్‌యూవీ అంటే రగ్డ్ అర్బన్ వెహికల్. ఈ స్కూటర్ఱ స్పెసిఫికేషన్లు, ధరలు, ఇతర కీలక వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..