సికింద్రాబాద్లోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. విరన్ జైన్ అనే బాలుడు సికింద్రాబాద్లోని ప్రయివేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
పాఠశాలలో చపాతీ రోల్ తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. ఆ విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.