అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన యూఎస్ ట్రెజరీ సెక్రటరీగా స్కాట్ బెసెంట్ను ఎంచుకోవడం, ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ 3% పతనమైంది.
ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,628 డాలర్ల వద్దకు చేరింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 1,310 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 1,200 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 980 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 2,000 రూపాయలు దిగి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,240 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,800 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 57,930 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 98,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,240 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 70,800 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 57,930 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 98,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్ ₹ 77,240 ₹ 70,800 ₹ 57,930 ₹ 98,000
విజయవాడ ₹ 77,240 ₹ 70,800 ₹ 57,930 ₹ 98,000
విశాఖపట్నం ₹ 77,240 ₹ 70,800 ₹ 57,930 ₹ 98,000
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,080 ₹ 7,724
ముంబయి ₹ 7,080 ₹ 7,724
పుణె ₹ 7,080 ₹ 7,724
దిల్లీ ₹ 7,095 ₹ 7,739
జైపుర్ ₹ 7,095 ₹ 7,739
లఖ్‌నవూ ₹ 7,095 ₹ 7,739
కోల్‌కతా ₹ 7,080 ₹ 7,724
నాగ్‌పుర్ ₹ 7,080 ₹ 7,724
బెంగళూరు ₹ 7,080 ₹ 7,724
మైసూరు ₹ 7,080 ₹ 7,724
కేరళ ₹ 7,080 ₹ 7,724
భువనేశ్వర్ ₹ 7,080 ₹ 7,724
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Countries)
దేశం పేరు
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
దుబాయ్ (UAE) ₹ 6,874 ₹ 7,419
షార్జా (UAE) ₹ 6,874 ₹ 7,419
అబు ధాబి (UAE) ₹ 6,874 ₹ 7,419
మస్కట్ (ఒమన్) ₹ 6,881 ₹ 7,329
కువైట్ ₹ 6,603 ₹ 7,202
మలేసియా ₹ 6,846 ₹ 7,129
సింగపూర్ ₹ 6,795 ₹ 7,539
అమెరికా ₹ 6,571 ₹ 6,992
ప్లాటినం ధర (Today’s Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల ‘ప్లాటినం’ ధర రూ. 610 తగ్గి రూ. 25,320 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.