సిగరెట్లు, పొగాకుపై 35 శాతం జీఎస్టీ

www.mannamweb.com


కొన్ని రకాల డ్రింక్స్​, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని జీఎస్టీపై ఏర్పాటైన మంత్రుల గ్రూపు (జీఓఎం) నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి.

బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వంలోని గ్రూపు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రూ.1,500 వరకు ధర ఉండే రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ. 1,500 నుంచి రూ. 10వేల మధ్య ఉన్న వాటిపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారు.

10వేల కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై 28 శాతం పన్ను ఉంటుంది. మొత్తం 148 వస్తువులపై పన్ను రేట్లను మార్చాలని జీఓఎం సిఫార్సు చేసింది. ఈ నెల 21న జరిగే జీఎస్టీ మండలిలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ రేటు మార్పులపై కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం కారు, వాషింగ్ మెషీన్ వంటి విలాసవంతమైన వస్తువులు, ఎరేటెడ్ వాటర్, పొగాకు ఉత్పత్తులు వంటి వస్తువులపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. రేట్ల మార్పిడిపై జీఓఎం తయారు చేసిన నివేదికను సోమవారం కౌన్సిల్​కు అందజేస్తారు.