జబర్దస్త్ కమెడీయన్ కు కారు యాక్సిడెంట్

www.mannamweb.com


జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తుక్కుగూడ ఔటర్ పై జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కు పెను ప్రమాదం తప్పింది.

షూటింగ్ స్పాట్ కి వెళ్తుండగా తుక్కుగూడ సమీపంలో జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం. జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ వెయ్యడంతో ఈ ఘటన జరిగింది. ఈ తరుణంలోనే… జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కారును వెనక నుండి ఆటో ఢీ కొట్టింది. దీంతో రాంప్రసాద్ తన కారును ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలు అయ్యాయని చెబుతున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.