SBI క్రెడిట్ కార్డు వాడుతున్నారా? వీటిపై కొత్త రూల్స్

www.mannamweb.com


ఈ రోజుల్లో ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఒకటికి మించి క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్నారని చెప్పొచ్చు. బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా వేగంగా క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తున్నాయి. అయితే.. క్రెడిట్ కార్డుల్లో దేనికవే ప్రత్యేకతల్ని కలిగి ఉంటాయి. ఒక్కో దానిపై ఒక్కో రకమైన బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. మన అవసరాల్ని బట్టి ఏ క్రెడిట్ కార్డు నప్పుతుందో తీసుకోవడం ముఖ్యం. ఇక.. క్రెడిట్ కార్డు నియమనిబంధనల్ని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు మధ్యమధ్యలో మారుస్తుంటాయి. దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ కార్డ్ కూడా.. తమ కొన్ని విభాగాల క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు ప్రకటించింది.

ముఖ్యంగా కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో.. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్/మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌పై రివార్డ్ పాయింట్ల సేకరణను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎస్బీఐ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఇది డిసెంబర్ 1 నుంచి అమలవుతుంది. ఆ క్రెడిట్ కార్డుల లిస్ట్ ఇక్కడ చూద్దాం.

AURUM, ఎస్‌బీఐ కార్డ్ ELITE, ఎస్‌బీఐ కార్డ్ ELITE అడ్వాంటేజ్, ఎస్‌బీఐ కార్డ్ పల్స్, సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డ్, సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ కార్డ్ PRIME అడ్వాంటేజ్, ఎస్‌బీఐ కార్డ్ PRIME Pro, ఎస్‌బీఐ కార్డ్ ప్లాటినం అడ్వాంటేజ్, గోల్డ్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ క్లాసిక్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ డిఫెన్స్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ అండ్ మోర్ ఎంప్లాయీ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ అండ్ మోర్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ అండ్ మోర్ ఎస్బీఐ కార్డ్, సింప్లీసేవ్ ఎస్బీఐ కార్డ్, సింప్లీసేవ్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్, సింప్లీసేవ్ ఎంప్లాయీ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ అండ్ మోర్ టైటానియం ఎస్బీఐ కార్డ్, సింప్లీసేవ్ ప్రో ఎస్బీఐ కార్డ్, క్రిషక్ ఉన్నతి ఎస్బీఐ కార్డ్ ఇలా ఇంకా చాలానే లిస్ట్ ఉంది.

ఇదే సమయంలో డిసెంబర్ 1 నుంచి.. ఎస్బీఐ కార్డ్ ఇతర కొన్ని కీలక మార్పులు కూడా ప్రకటించింది. యుటిలిటీ పేమెంట్స్ బిల్లింగ్ పీరియడ్‌లో రూ. 50 వేలు దాటినట్లయితే ఒక శాతం ఛార్జీ పడుతుందని వెల్లడించింది. ఇందులో టెలిఫోన్, మొబైల్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వంటివి ఉంటాయని గమనించాలి.