టాటా సుమో ఒక ప్రముఖ భారతీయ SUVs (Sport Utility Vehicle) బ్రాండ్. టాటా సుమో ప్రారంభంలో ఒక మిడిలేంజ్ SUVగా మార్కెట్లో ప్రవేశించింది. దాని స్టైల్, స్థిరమైన ఇంజిన్, మంచి రహదారి హ్యాండ్లింగ్, వినియోగదారుల అవసరాలకు సరిపోయే సామర్థ్యం వలన ఇది భారతదేశంలో త్వరగా ప్రజాదరణ పొందింది.
ప్రధానంగా 10-12 మంది ప్రయాణించడానికి ఆక్సమైజ్డ్ గా డిజైన్ చేశారు. తక్కువ ధరలో అత్యధిక స్థాయిలో సామర్ధ్యం అందించే ప్రయాణ వాహనంగా మిళితమైనది. టాటా సుమోను మొదటగా రూరల్ ప్రాంతాలలో విస్తృతంగా కొనుగోలు చేశారు, ఎందుకంటే దీనిలో ఎక్కువ మంది కూర్చొవడానికి తగిన స్థలాన్ని కలిగి ఉండటం, అలాగే దృఢమైన నిర్మాణం దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించడానికి అనుకూలంగా మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టాటా సుమోకు మంచి ఆదరణ ఉంది. ఇది పర్యాటక రవాణా, ఎక్సిక్యూటివ్ కార్, వ్యాపార ప్రయాణాల కోసం, అలాగే సామాజిక సేవల సంస్థలు, ప్రభుత్వ విభాగాల కోసం ఉపయోగించారు. టాటా సుమో ప్రయాణీకులకు ఒక బలమైన, విశ్వసనీయ వాహనం కావడంతో, అది దాదాపు 20 సంవత్సరాల పాటు భారతదేశం లో ఒక పెద్ద మార్కెట్ వాటా పొందింది.
ఈ వాహనానికి పోటీగా మరింత ఆధునిక వాహనాలు, SUV లు వచ్చినప్పటికీ, టాటా సుమో తన స్థానం ఎన్నో సంవత్సరాలు నిలుపుకుంది. 2000 ల ప్రారంభంలో దాని విక్రయాలు అద్భుతంగా పెరిగాయి. 2019 వరకు, సుమో లక్షల్లో అమ్ముడయ్యింది. అయితే టాటా మోటార్స్ తన ఫేమస్ SUV టాటా సుమోను 2025లో కొత్తగా రిలీజ్ చేయబోతుంది. భారతదేశంలో జరిగే ఆటో ఎక్స్పో 2025లో ఈ కొత్త సుమో మోడల్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కొత్త వాహనం నచ్చే వారికోసం టాటా మోటార్స్ చాలా ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో సుమోను విడుదల చేయబోతుంది. టాటా సుమో 2025లో పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. టాటా మోటార్స్ ఈ కొత్త మోడల్లో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో కొత్త LED హెడ్లైట్లను అందించబోతుంది. ముందుకి, కొత్త 19 లేదా 20 అంగుళాల వీల్స్, పెద్ద సైడ్ ప్రొఫైల్‌తో పాటు షార్ప్ LED టెయిల్ లైట్లు వెనుక భాగంలో కనిపిస్తాయి.
డిజైన్ నుంచి ఇది సఫారీ, హారియర్ వంటి టాటా మోడల్స్‌తో పోల్చితే కొంచెం తక్కువ ప్రీమియం అనుకుంటున్నప్పటికీ, ఇది కొత్త సుమో అభిమానులకు హిట్ అవుతుందనే అంచనా ఉంది. వినియోగదారులు దీని లాంచ్ కోసం కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇంటీరియర్ చాలా ప్రీమియం గా ఉండనుంది. 5 నుంచి 7 మందికి అనువుగా ఉన్న స్పేస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సౌకర్యవంతమైన అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. భద్రతకు సంబంధించి 6 ప్లస్ ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), EBD, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉంటాయి. కొత్త సుమో రెండు ఇంజన్ వేరియంట్లతో – పెట్రోల్, డీజిల్ – అందుబాటులో ఉండబోతుంది. ఇందులో 2.0 లీటర్ ఇంజన్ ఉండొచ్చు. కార్ ధర రూ.12 లక్షలు నుంచి రూ.14 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ కొత్త మోడల్ గురించి పూర్తి వివరాలు జనవరి 17-18 తేదీల్లో వెలువడే అవకాశం ఉంది.